Alia Bhatt: ఆలియా భట్ కి సౌత్ లో కూడా ఫుల్ క్రేజ్ ఉంది. కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో పనిచేయడం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు చెప్పింది ఈ బాలీవుడ్ చిన్నది. ఆలియా భట్ మాట్లాడుతూ.. ‘నన్ను ఇంట్లో ఆలూ అని పిలుస్తారు. పుష్ప సినిమా చూసిన నా కుటుంబ సభ్యులు, ఆలూ.. అల్లుతో ఎప్పుడు సినిమా చేస్తున్నావ్?’ అని ఆటపట్టిస్తున్నారని వెల్లడించింది. మొత్తానికి ఆలియా, మొహమాటం లేకుండా బన్నీతో సినిమా చేయాలని ఉందని ఓపెన్ అయ్యింది.

కాగా, ‘ఆర్ఆర్ఆర్’లో నటించిన ఆలియా.. ఎన్టీఆర్‌తో మరో సినిమాలో నటించనుంది. మరి బన్నీతోనూ మూవీ చేసే అవకాశం ఉందో, లేదో చూడాలి మరి. అన్నట్టు ఎన్టీఆర్ కోసం ఎదురుచూస్తున్నాను అని అలియా భట్ ఇప్పటికే చెప్పిన సంగతి తెలిసిందే.’యంగ్ టైగర్ ఎన్టీఆర్’ – స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రానున్న పాన్ ఇండియా సినిమాలో.. ఎన్టీఆర్ సరసన ఫలానా స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుంది.
Also Read: ప్రముఖ బ్యాంక్ లో 100 ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?
లేదు, ఫలానా హీరోయిన్ ను ఆల్ రెడీ హీరోయిన్ గా ఫిక్స్ అయింది అంటూ, ఇలా అనేక రకాలుగా రూమర్స్ వినిపించాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఆలియా ఫిక్స్ అయింది. ఇప్పటికే అగ్రిమెంట్ కూడా పూర్తి అయింది. మరి ఈ బాలీవుడ్ క్రేజీ బ్యూటీతో ఎన్టీఆర్ మాస్ స్టెప్స్ ఎలా ఉంటాయో చూడాలి.

త్వరలోనే ఈ వార్త పై అధికారిక ప్రకటన రానుంది. అయితే, ఈ సినిమా గురించి హీరోయిన్ ఆలియా భట్ ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘ఎన్టీఆర్ 30 కోసం నన్ను సంప్రదించారు. ఆల్ రెడీ కొరటాల శివ స్టోరీ కూడా చెప్పారు. నేను మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పాను. మా కాంబినేషన్ వర్కవుట్ అవుతుందని అనుకుంటున్నాను. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ తో కలిసి నటించడం కోసం ఎదురుచూస్తున్నాను’ అని చెప్పిన సంగతి తెలిసిందే.
Also Read: బాలీవుడ్ క్రేజీ ఆఫర్లు రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్లు వీళ్ళే !