Sree Vishnu Alluri Teaser: ఆ కుర్రాడికి చిన్నతనం నుండే సినిమాలంటే విపరీతమైన పిచ్చి. ఆ పిచ్చి, ఆ ఇష్టమే అతన్ని నేడు హీరోను చేసింది. యంగ్ హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం తెలుగు చిత్ర సీమలో మంచి టాలెంట్ ఉన్న హీరో. శ్రీవిష్ణు హీరోగా ‘అల్లూరి’ అనే సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ని ఆవిష్కరించారు మేకర్స్. శ్రీవిష్ణు అల్లూరిలో పోలీసుగా అదరగొట్టాడు. “ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్” అనే వాయిస్ ఓవర్ తో మొదలైన ఈ టీజర్ లో శ్రీవిష్ణు ఎస్‌ఐగా కుమ్మేశాడు.

నక్సల్స్ ప్లేస్‌కి వెళ్లి మరీ, ఎస్‌ఐ అల్లూరి సీతారామరాజుగా తన దమ్ము చూపించాడు. ఆసక్తికర రీతిలో ప్రారంబమైన ఈ టీజర్ లో.. పవర్ ఫుల్ పోలీసు అధికారిగా శ్రీవిష్ణు చాలా బాగా ఆకట్టుకున్నాడు. దర్శకుడు ప్రదీప్ వర్మ శ్రీవిష్ణు పాత్రకు పర్ఫెక్ట్ ఎలివేషన్స్ ఇచ్చాడు. హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఈ టీజర్ స్థాయిని పెంచింది. టీజర్ గ్రిప్పింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా సాగింది. సినిమా కూడా ఆ స్థాయిలోనే ఉండబోతుందని అర్ధం అవుతుంది.
Also Read: Modi vs KCR: కేసీఆర్ పై రివేంజ్ తీర్చుకున్న మోడీ..
ఈ సినిమాలో కథానాయికగా నటించిన కయదు లోహర్ కూడా చాలా క్యూట్ గా నటించిందట. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ టీజర్ కూడా సినిమా పై చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. ఒక పాట మినహా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. అల్లూరి రిలీజ్ డేట్ త్వరలో వెల్లడి కానుంది. నిజానికి తన సినిమా బడ్జెట్ విషయంలో వంద ఆలోచించే నిర్మాత బెక్కం వేణుగోపాల్ కూడా ఈ సినిమా విషయంలో అసలు బడ్జెట్ పరిమితులే పెట్టుకోలేదు.

మరో నిర్మాత దిల్ రాజు కూడా ఈ సినిమా కథ విని నిర్మాణంలో తాను భాగం కావాలని ఏరికోరి వచ్చారట. మరి ఇంతమంది ఈ సినిమాని నమ్మడానికి కారణం ఒక్కటే.. సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందట. చూడాలి మరి అల్లూరి ఏ రేంజ్ హిట్ అవుతుందో.
ఏది ఏమైనా శ్రీవిష్ణు ముందు నుంచీ వైవిధ్యభరితమైన కథలనే ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. అయితే.. ఇలాంటి ప్రయోగాలు చేసిన ప్రతి దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తనకు విజయాలూ దక్కకపోయినా పర్వాలేదు. డిఫరెంట్ సినిమాలే తన టార్గెట్ అంటున్నాడు ఈ హీరో.
Also Read: Yadamma Special Dishes For PM Modi: యాదమ్మ వంటలకు ఫిదా.. టేస్ట్ చేసి మోడీ ఏమన్నాడో తెలుసా?
[…] […]
[…] […]
[…] […]