అల్లు శిరీష్ కి అలాంటి డైరెక్టరా…

ఇండియాలో రాజ్ కపూర్ ఫామిలీ తరవాత ఎక్కువ మంది హీరోలు ఉన్నది మెగాస్టార్ ఫ్యామిలీలోనే …అందుకే వీరిని క్రికెట్ టీం అంటూ మీడియా లో ప్రస్తావిస్తుంటారు. మెగా ఫామిలీ లో మెజారిటీ హీరోలు సక్సెస్ అయిన నేపథ్యంలో వారి ఉనికి కి ఒక ప్రత్యేకత వచ్చింది. ఐతే .వీరిలో అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ ఇప్పటిదాకా నిలదొక్కుకోలేకపోవడమే ఒకింత వెలితిగా అనిపిస్తుంటుంది. చిరంజీవి చిన్నఅల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా ఇంకా నిలదొక్కు కోలేదు. అయితే […]

Written By: Neelambaram, Updated On : March 12, 2020 5:55 pm
Follow us on

ఇండియాలో రాజ్ కపూర్ ఫామిలీ తరవాత ఎక్కువ మంది హీరోలు ఉన్నది మెగాస్టార్ ఫ్యామిలీలోనే …అందుకే వీరిని క్రికెట్ టీం అంటూ మీడియా లో ప్రస్తావిస్తుంటారు. మెగా ఫామిలీ లో మెజారిటీ హీరోలు సక్సెస్ అయిన నేపథ్యంలో వారి ఉనికి కి ఒక ప్రత్యేకత వచ్చింది. ఐతే .వీరిలో అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ ఇప్పటిదాకా నిలదొక్కుకోలేకపోవడమే ఒకింత వెలితిగా అనిపిస్తుంటుంది.

చిరంజీవి చిన్నఅల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా ఇంకా నిలదొక్కు కోలేదు. అయితే కళ్యాణ్ దేవ్ సినీ రంగానికి కొత్త కాబట్టి హీరోగా కుదురుకోలేకపోతున్నాడని అనుకోవచ్చు. పైగా అతను చేసింది ఒక్క సినిమానే. కానీ అల్లు శిరీష్ అలా కాదు. చిన్నప్పట్నుంచి సినిమాలతోనే సావాసం చేశాడు. పైగా అన్నయ్య అల్లు అర్జున్ పెద్ద స్టార్ హీరో.. నాన్న పెద్ద నిర్మాత. తనకూ సినీ రంగంతో పరిచయాలున్నాయి. ఇన్నీ ఉండి కూడా శిరీష్ సక్సెస్ కాలేకపోయాడు.

అల్లు శిరీష్ సినీ కెరీర్ లో ఆరు సినిమాలు వచ్చాయి. వాటిలో 2016 వచ్చిన ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రం మినహా మరో సక్సెస్సే లేదు. ఆ తర్వాత చేసిన సినిమాలు అన్నీ ఫ్లాపులే. చివరగా ‘ఏబీసీడీ’ అనే రీమేక్ సినిమా చేస్తే అది కూడా ఫెయిల్ అయ్యింది. దీని తర్వాత మంచి ప్రాజెక్టు సెట్ చేసుకుంటాడని అంతా అనుకొన్నారు.

ఐతే అల్లు శిరీష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఒక ఫెయిల్యూర్ దర్శకుడితో చేయబోతున్నాడు. గతంలో మెగా స్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ తో ‘విజేత’ సినిమా తీసిన రాకేశ్ శశితో మూవీ కి కమిట్ అయ్యాడు.దీని కంటే ముందు రాకేష్ శశి తీసిన ‘జతకలిసే’ అనే సినిమా కూడా ప్లాప్ అయ్యింది. అలా రెండూ ఫ్లాపులే ఇచ్చాడు.. దర్శకుడిగా కొంచెం అభిరుచి ఉన్నట్లు కనిపిస్తాడు కానీ.. సినిమా చేసి ప్రేక్షకుల్ని మెప్పించే స్థాయి లేదు. అందుకే అల్లు శిరీష్ కాస్త పేరున్న దర్శకుడితో ఒక సెన్సేషనల్ సినిమా చేస్తే తప్ప ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టు కోలేడు 43 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉన్న అల్లు అరవింద్ గారు తన చిన్న కొడుకు విషయం లో ఇంకాస్త శ్రద్ద పెట్టక తప్పదు.
Time and tide wait for none