Allu Sirish: మెగా ఫ్యామిలీ నుండి సినీ ఇండస్ట్రీ లోకి వచ్చి సక్సెస్ ని చూడని హీరో అల్లు శిరీష్(Allu Sirish). ‘గౌరవం’ చిత్రం తో వెండితెర అరంగేట్రం చేసిన ఈయన, తన కెరీర్ లో అత్యధిక శాతం మంచి స్క్రిప్ట్స్ ని ఎంచుకున్నాడు కానీ, ఆడియన్స్ ఎందుకో ఆయన్ని ఆదరించలేదు. ఆయన గత చిత్రం ‘బడ్డీ’ గత ఏడాది విడుదలై పాజిటివ్ రివ్యూస్ ని తెచ్చుకుంది, కానీ కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఈ చిత్రానికి ముందు వచ్చిన ‘ఊర్వశివో..రాక్షసివో’ చిత్రానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ థియేటర్స్ లో యావరేజ్ గా ఆడింది. ఈయన కెరీర్ మొత్తం మీద క్లీన్ హిట్ గా నిల్చిన చిత్రం ఏదైనా ఉందా అంటే, అది ‘శ్రీరస్తు..శుభమస్తు’ చిత్రం మాత్రమే. వరుణ్ తేజ్ సతీమణి లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం మంచి కమర్షియల్ హిట్ అయ్యింది.
Also Read: పాజిటివ్ టాక్ వచ్చింది..కానీ కలెక్షన్స్ నిల్..శ్రీ విష్ణు ‘సింగిల్’ పరిస్థితి ఏంటంటే!
అయితే అన్నయ్య పెద్ద సూపర్ స్టార్ అయ్యాడు, తానూ కూడా అలాంటి సూపర్ స్టార్ కాకపోయినా, కనీసం ఇండస్ట్రీ లో సక్సెస్ అయితే బాగుంటుంది అని అల్లు శిరీష్ ఎన్నో సార్లు అనుకొని ఉంటాడు. కానీ ఆయన బ్యాడ్ అలా ఉంది, ఏం చెయ్యలేం. ఇకపోతే ఆయన వయస్సు ఇప్పుడు 37 ఏళ్ళు. ఈయనకంటే చిన్న వాళ్లంతా పెళ్లిళ్లు చేసుకొని, పిల్లల్ని కని దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అల్లు శిరీష్ మాత్రం ఇంకా సోలో లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే రీసెంట్ గానే ఆయన ‘సింగిల్’ మూవీ ఇంటర్వ్యూ లో మూవీ టీం తో కలిసి సరదాగా కాసేపు చిట్ చాట్ చేసాడు. ఈ చిట్ చాట్ లో అల్లు శిరీష్ పెళ్లి ప్రస్తావన వచ్చింది. దానికి ఆయన చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఆయన మాట్లాడుతూ ‘ఇంట్లో నన్ను పదేళ్ల నుండి పెళ్లి చేసుకోమని అడుగుతూ ఉంటారు. కానీ నేను చేసుకోను అని చెప్పాను. పెళ్లి చేసుకుంటే ఫ్రీడమ్ పోతుంది. అదే సింగిల్ గా ఉంటే మన ఇష్టమొచ్చినట్టు బ్రతకొచ్చు. నా స్నేహితులలో అనేక మంది పెళ్లిళ్లు చేసుకున్నారు. వాళ్ళు వాళ్ళ అనుభవం దృష్ట్యా నన్ను పెళ్ళికి బానిస కాకు అని హెచ్చరించారు. మాలాగా పెళ్లి చేసుకొని కష్టాలపాలు అవ్వొద్దు అన్నారు. అందుకే నేను జీవితం లో పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు అల్లు శిరీష్. అయితే గతంలో ఆయన ప్రముఖ హీరోయిన్ అను ఇమ్మానుయేల్ తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి. కానీ వాటిల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. అయితే ఒక వయస్సు వరకు సింగిల్ గా జీవించడం బాగానే ఉంటుంది, కానీ ఒక వయస్సు వచ్చాక కచ్చితంగా తోడు కావాలి. 37 ఏళ్ళ వయస్సు నిండిన అల్లు శిరీష్ భవిష్యత్తులో అయినా మనసు మార్చుకుంటాడో లేదో చూడాలి.