Allu Kanakaratnam: సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే…ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న గుర్తింపు ఏ ఫ్యామిలీకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మెగాస్టార్ చిరంజీవి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని శాసిస్తూ ప్రేక్షకులందరిని తనవైపు తిప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఈ ఏజ్ లో కూడా ఆయన మంచి సినిమాలను చేయడానికి కసరత్తులను చేస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… ఇక ఇదిలా ఉంటే అల్లు ఫ్యామిలీ నుంచి సైతం ఇప్పుడు హీరోలు వస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ స్టార్ హీరోగా వెలుగొందుతుందటమే కాకుండా తన తమ్ముడైన అల్లు శిరీష్ సైతం ఆడపదడప సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
Also Read: చంద్రబాబు ప్రభుత్వం పై మరో బాంబు పేల్చిన ఆర్కే
మరి ఇలాంటి సందర్భంలో ఈ రెండు ఫ్యామిలీల మధ్య గత కొన్ని రోజుల నుంచి కొంతవరకు గొడవలైతే ఉన్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక రీసెంట్గా అల్లు రామలింగయ్య భార్య చనిపోవడంతో ఈ రెండు ఫ్యామిలీలు ఒకటైనట్టుగా తెలుస్తోంది…ఇక కనకరత్నంగారంటే అటు మెగాస్టార్ చిరంజీవికి, ఇటు అల్లు అరవింద్ కి చాలా అమితమైన ఇష్టమని గతంలో కూడా తెలియజేశారు.
మరి ఏది ఏమైనా కూడా కనకరత్నం గారి అంత్యక్రియలకు వీళ్ళందరూ హాజరై ఏ ఆటంకము లేకుండా వాటిని చాలా చక్కగా పూర్తి చేశారు. మరి ఇలాంటి క్రమంలోనే కనక రత్నం గారికి అటు రామ్ చరణ్, ఇటు అల్లు అర్జున్ ఇద్దరు మనవలు అవుతారు కాబట్టి వీళ్ళిద్దరిలో ఆమెకు ఎవరంటే ఇష్టం అని ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో వాళ్ళ అభిప్రాయాలనైతే తెలియజేస్తున్నారు.
నిజానికి కనకరత్నం గారు గతంలో అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరు అంటే తమకు ఇష్టమని ముఖ్యంగా రామ్ చరణ్ అంటే తనకు చాలా ఇష్టమని గతంలో అయితే చెప్పింది. ఎందుకంటే సురేఖ గారు అంటే ఆమెకు చాలా ఇష్టమట. చిన్న కూతురు కావడంతో మొదటి నుంచి కూడా ఆమెను చాలా గారాబంగా పెంచామని ఆ తర్వాత రామ్ చరణ్ పుట్టిన తర్వాత సురేఖ మీద ఉన్న గారాబం రామ్ చరణ్ మీద చూపించే వాళ్లమని గతంలో ఆమె చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఆమెను కోల్పోవడం అనేది రెండు ఫ్యామిలీలకు తీరని లోటనే చెప్పాలి…