ఆ హీరోయిన్ తో అల్లు హీరో సహజీవనం

టాలీవుడ్ టాప్ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ టాలీవుడ్ లో హీరోగా నిలబడేందుకు ఆపసోపాలు పడుతున్నాడు. ఎంతో మందిని ఇండస్ట్రీలో నిలబెట్టి.. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన అల్లు అరవింద్ తన చిన్న కొడుకుకు మాత్రం హీరోగా బ్రేక్ ఇవ్వలేకపోతున్నారు. తాజాగా అల్లు అరవింద్ మరోసారి శిరీష్ తో సినిమా మొదలుపెట్టాడు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ సంస్థ బ్యానర్ పై బన్నీవాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘శిరీష్6’ ప్రాజెక్టుగా […]

Written By: NARESH, Updated On : May 30, 2021 12:53 pm
Follow us on

టాలీవుడ్ టాప్ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ టాలీవుడ్ లో హీరోగా నిలబడేందుకు ఆపసోపాలు పడుతున్నాడు. ఎంతో మందిని ఇండస్ట్రీలో నిలబెట్టి.. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన అల్లు అరవింద్ తన చిన్న కొడుకుకు మాత్రం హీరోగా బ్రేక్ ఇవ్వలేకపోతున్నారు.

తాజాగా అల్లు అరవింద్ మరోసారి శిరీష్ తో సినిమా మొదలుపెట్టాడు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ సంస్థ బ్యానర్ పై బన్నీవాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘శిరీష్6’ ప్రాజెక్టుగా నామకరణం చేశారు. ఈ సినిమాకు టైటిల్ కోసం అన్వేషిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రోమాంటిక్ ప్రీలుక్ పోస్టర్ కు విశేష స్పందన వచ్చింది. ఇందులో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూయల్ ఇద్దరూ అద్దం ముందు చేతులు అడ్డు పెట్టి మరీ ముద్దులు పెట్టుకుంటున్న ఫొటో వైరల్ అయ్యింది. ఇద్దరి మధ్య రోమాన్స్ పీక్స్ లో ఉన్నట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఓ మంచి ప్రేమ కథతో అల్లు శిరీష్ రాబోతున్నట్టు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమా లివింగ్ రిలేషన్ సిప్ నేపథ్యంలో ఉంటుందని టాక్. శిరీష్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈరోజు విడుదల చేశారు.

రెండు పోస్టర్ల ప్రీలుక్ లు మంచి రోమాంటిక్ మూడ్ లుక్ లో అల్లు శిరీష్, అనులు ప్రేమ విరహంలో మునిగిపోయిన ఈ పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. సహజీవనం కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమాకు ‘ప్రేమ కాదంట’ అనే టైటిల్ ను అల్లు శిరీష్ బర్త్ డే సందర్భంగా ఈ రోజు విడుదల చేశారు. రాకేశ్ శశి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని బన్నీ వాస్, అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ తన సోదరుడికి ఈ పోస్టర్ రిలీజ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.