Allu Arvind: హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా కోడలు కానుంది. హీరో వరుణ్ తేజ్ తో ఆమె ఏడడుగులు వేయనుంది. ఐదేళ్లకు పైగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఫైనల్లీ ఓపెన్ అయ్యారు. జూన్ 9న హైదరాబాద్ లోని నాగబాబు నివాసంలో నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే ఆహ్వానం లభించింది. మెగా హీరోలైన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ హాజరయ్యారు. చిరంజీవి దంపతులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.
నిశ్చితార్థం ముగిసిన నేపథ్యంలో ఇక పెళ్లే తరువాయి. ఈ ఏడాది చివర్లో లావణ్య-వరుణ్ ల వివాహం జరగనుందని సమాచారం. కొత్త జంట మాత్రం విదేశాల్లో విహరిస్తున్నారు. తమ జాలీ ట్రిప్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తున్నారు. తాజాగా నిర్మాత అల్లు అరవింద్ లావణ్య త్రిపాఠిని ఉద్దేశించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలుగు అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో అని నేను సరదాగా అన్నాను. లావణ్య త్రిపాఠి నిజంగానే మా వాడిని పెళ్లాడుతుందంటూ నవ్వేశారు.
లావణ్య త్రిపాఠి-కార్తికేయ కాంబోలో చావు కబురు చల్లగా మూవీ తెరకెక్కింది. ఈ చిత్ర ప్రమోషనల్ ఈవెంట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ… ఎక్కడో నార్త్ ఇండియా నుండి వచ్చి తెలుగు నేర్చుకొని బాగా మాట్లాడుతున్నావు. ఇక్కడే ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో సరిపోతుంది, అన్నారు. అల్లు అరవింద్ మాటలకు లావణ్య గట్టిగా నవ్వేసింది. కట్ చేస్తే అది జరిగిన రెండేళ్లకు ఆయన ఫ్యామిలీకే చెందిన వరుణ్ తేజ్ తో నిశ్చితార్థం జరుపుకుంది.
ఈ విషయాన్ని అల్లు అరవింద్ బేబీ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో గుర్తు చేసుకున్నాడు. నేనేదో సరదాగా చెబితే లావణ్య త్రిపాఠి సీరియస్ గా తీసుకుంది. ఏకంగా మావాడినే పెళ్లి చేసుకోబోతుందని సెటైరికల్ గా మాట్లాడారు. లావణ్య త్రిపాఠిని ఉద్దేశించి అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బహుశా అల్లు అరవింద్ కి అప్పటికే లావణ్య-వరుణ్ రిలేషన్ తెలిసి కూడా ఉండొచ్చు. లావణ్య ఆయన బ్యానర్ లో మూడు చిత్రాలు చేసింది. తెలిసే ఆయన ఇలా సెటైరికల్ గా మాట్లాడి ఉండొచ్చని కొందరి అభిప్రాయం.