Kantara Collections: కాంతార చిత్రం నిర్మాత అల్లు అరవింద్ కి గోల్డ్ మైన్ లా దొరికింది. ఈ మూవీతో ఆయన జేబులు ఫుల్ గా నిండనున్నాయి. రెండో రోజే 150 శాతం లాభాలు కాంతార తెచ్చిపెట్టింది. ఫుల్ రన్ ముగిసే నాటికి కాంతార పెట్టుబడికి పది రెట్లు వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. గత మూడు వారాలుగా కన్నడ చిత్రం కాంతార గురించి విపరీతమైన చర్చ నడుస్తుంది. ఈ మూవీ అద్భుతం అంటూ క్రిటిక్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. సెప్టెంబర్ 30న కర్ణాటకలో విడుదలైన కాంతార భారీ ఆదరణ దక్కించుకుంది.

అక్టోబర్ 15న తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో కాంతార విడుదల చేశారు. అన్ని భాషల్లో ఈ చిత్రం ట్రెమండస్ టాక్ సొంతం చేసుకుంది. కాంతార చిత్రాన్ని కేవలం టైటిల్ చూసి జనాలు వెళుతున్నారు. ఆ మూవీ హీరో, హీరోయిన్, దర్శకుడు ఎవరికీ తెలియదు. కానీ ఒక స్టార్ హీరో సినిమా కోసం ఎగబడ్డట్లు ప్రేక్షకులు థియేటర్స్ వద్ద క్యూ కట్టారు.
కాంతార తెలుగు వెర్షన్ కి పెద్దగా ప్రమోషన్స్ కూడా నిర్వహించలేదు. నిర్మాత అల్లు అరవింద్ తో పాటు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం,చర్చ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఆ ప్రభావం ఓపెనింగ్ డే చూపించింది. అలాగే హీరో ప్రభాస్ కాంతార చిత్రాన్ని రెండు సార్లు చూసినట్లు ట్వీట్ చేశాడు. శనివారం విడుదలైన కాంతార వసూళ్లు ఆదివారం మరింత పుంజుకున్నాయి.

ఫస్ట్ డే కాంతార చిత్రానికి రూ. 2 కోట్ల షేర్ దక్కింది. వరల్డ్ వైడ్ రూ. 5 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. అంటే మొదటిరోజే పెట్టుబడి వచ్చేసింది. అల్లు అరవింద్ తెలుగు రైట్స్ కేవలం రూ. 2 కోట్లకు కొన్నారు. సెకండ్ డే కాంతార ఫస్ట్ డేకి మించి వసూలు చేసింది. రెండవ రోజు రూ. 2.85 కోట్ల షేర్ రాబట్టింది. ఫుల్ రన్ లో కాంతార 10 కోట్లకు పైగా షేర్ వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. ఈ క్రమంలో రూపాయి పెట్టుబడితో అల్లు అరవింద్ పది రూపాయలు సంపాదించనున్నాడు.