Allu Ayaan: తెలుగు సినిమా ఇండస్ట్రీ ని శాసించే స్థాయి ఉన్న ఇద్దరు ముగ్గురు నిర్మాతలలో ఒకరు అల్లు అరవింద్. మెగాస్టార్ చిరంజీవి ఈ కుటుంబానికి అల్లుడు అయ్యాక అల్లు అరవింద్ జాతకమే మారిపోయింది. అప్పట్లో కొన్ని సినిమాల్లో తండ్రి అల్లు రామలింగయ్య లాగ కమెడియన్ పాత్రలు ప్రయత్నం చేసాడు కానీ, అంతగా అచ్చి రాలేదు. కానీ ఆ తర్వాత నిర్మాతగా మారి మెగాస్టార్ చిరంజీవి ని పెట్టి ఎన్నో సినిమాలు తీసాడు. అవి గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో నిర్మాతగా ఇండస్ట్రీ లో నిలదొక్కుకున్నాడు. కేవలం నిర్మాతగా మాత్రమే కాదు, డిస్ట్రిబ్యూటర్ గా కూడా అల్లు అరవింద్ విజయం సాధించాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఒక సినిమా నిర్మాణం జరిగినా, అదే బ్యానర్ డిస్ట్రిబ్యూషన్ లో ఒక సినిమా విడుదలైనా, ఆ చిత్రానికి విపరీతమైన క్రేజ్ మార్కెట్ లో వచ్చేస్తుంది.
అల్లు బ్రాండ్ కి ఉన్న క్రేజ్ అలాంటిది. అలా నిర్మాణ రంగం లో ఎప్పుడూ బిజీ గా ఉండే అల్లు అరవింద్ కాసేపు ప్రశాంతత కోసం తన మనవడు అల్లు అయాన్ తో కలిసి నిన్న క్రికెట్ ఆడాడు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. అల్లు అరవింద్ బౌలింగ్ వెయ్యగా, అల్లు అయాన్ ధోని లెవెల్ లో తనను తాను ఊహించుకొని భారీ సిక్సర్లు కొట్టాడు. దీంతో అల్లు అరవింద్ బంతిని పట్టుకోడానికి పరుగులు తియ్యాల్సిన పరిస్థితి వచ్చింది. అలా కాసేపు అల్లు అయాన్ తన తాతయ్య ని బౌలింగ్, ఫీల్డింగ్ చేయిస్తూ ఆటపట్టించాడు. అల్లు అయాన్ , అల్లు అర్హ కి సోషల్ మీడియా లో ఉండే క్రేజ్ మామూలుది కాదు. అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ రెడ్డి ఇంస్టాగ్రామ్ లో ఈ ఇద్దరి పిల్లలకు సంబంధించిన క్యూట్ వీడియోలు, ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఉంటుంది. అవి సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యి వీళ్లిద్దరికీ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడేలా చేసింది. ముఖ్యంగా అల్లు అర్హ అంటే ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరు.
క్యూట్ గా ఈ చిన్నారి చేసే పనులు చూసేందుకు ఎంతో ముచ్చటగా అనిపిస్తాయి. అలాగే అల్లు అయాన్ వేసే తుంటరి వేషాలు, చిలిపి పనులు సోషల్ మీడియా లో ఉండే నెటిజెన్స్ కి కడుపుబ్బా నవ్వించేలా చేస్తాయి. ఇంత చిన్న వయస్సులోనే వీళ్లిద్దరు ఇంత హుషారుగా ఉన్నారంటే, పెద్దయ్యాక ఇక ఏ రేంజ్ లో ఉంటారో ఊహించుకోవచ్చు. ఇది ఇలా ఉండగా అల్లు అర్హ ‘శాకుంతలం’ చిత్రం లో భరతుడి పాత్ర ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ కి బాలనటిగా పరిచయం అయ్యింది. అల్లు అయాన్ ఇప్పటి వరకు ఎలాంటి సినిమాల్లో నటించలేదు కానీ, అతని చురుకుదనం చూస్తుంటే సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన తండ్రి అల్లు అర్జున్ రేంజ్ కి ఎదుగుతాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
#tatamanavadu అల్లు అరవింద్.. ఆర్యన్ pic.twitter.com/wQv5z4zsQS
— devipriya (@sairaaj44) August 12, 2024