Allu Arjun : గత పది రోజుల నుండి ఇండియా వైడ్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ఏ రేంజ్ లో వినిపిస్తుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ‘పుష్ప 2’ చిత్రంతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని కొట్టి మన టాలీవుడ్ స్థాయిని మరో మెట్టు పైకి ఎక్కించాడు. మొదటి వారంలోనే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకున్న మొట్టమొదటి హీరోగా అల్లు అర్జున్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అయితే పాపం అల్లు అర్జున్ ఈ సక్సెస్ ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే ప్రీమియర్ షో రోజు ఆయన రాక కారణంగా తొక్కిసిలాట జరిగి రేవతి అనే మహిళా చనిపోవడం, ప్రొటొకాల్స్ సరిగా ఫాలో అవ్వలేదని అల్లు అర్జున్ ని మొన్న పోలీసులు అరెస్ట్ చేయడం వంటివి సంచలనంగా మారింది. అయితే అల్లు అర్జున్ కష్ట సమయంలో మెగా ఫ్యామిలీ మొత్తం ఎంత అండగా నిలబడిందో ఈ రెండు రోజుల్లో మనమంతా చూస్తూనే ఉన్నాం.
అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు అనే విషయాన్ని తెలుసుకున్న వెంటనే తీవ్రమైన దిగ్బ్రాంతికి గురైన మెగాస్టార్ చిరంజీవి వెంటనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లాలని అనుకున్నాడు. కానీ శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నందున పోలీసులు రావొద్దు అనడంతో అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి, అల్లు అరవింద్ కి ధైర్యం చెప్పి, తన వ్యక్తిగత న్యాయవాది నిరంజన్ రెడ్డి ని పంపించి బెయిల్ వచ్చేలా చేసాడు. తన మామయ్య చూపించిన ప్రేమకి కరిగిపోయిన అల్లుడు అల్లు అర్జున్ నేడు స్వయంగా తన కుటుంబం తో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళాడు. అక్కడ సుమారుగా గంటసేపు సమయం గడిపి వచ్చాడు. ఇప్పుడు కాసేపటి క్రితమే ఆయన నాగబాబు ని కూడా కలిసాడు. నాగబాబు కూడా నిన్న ఉదయం నుండి సాయంత్రం వరకు అల్లు అర్జున్ ఇంట్లోనే ఉంటూ ఎప్పటికప్పుడు అతని బెయిల్ పరిస్థితి ని అడిగి తెలుసుకున్నాడు.
చివరికి ఆయనకి బెయిల్ వస్తుంది అనే విషయం ఖరారు అవ్వడంతో తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఈ కృతజ్ఞతతోనే అల్లు అర్జున్ నేడు నాగబాబు ని కూడా తన కుటుంబ సమేతంగా వెళ్లి కలిసొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. నాగబాబు కి అల్లు అర్జున్ కి మధ్య చాలా కాలం నుండి కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవి కి వెళ్లి అల్లు అర్జున్ సపోర్ట్ చేసినప్పటి నుండి నాగబాబు అతనిపై అసంతృప్తి తో ఉన్నాడు. అల్లు అర్జున్ కూడా నాకు నచ్చితే ఎక్కడికైనా వెళ్తా అంటూ పరోక్షంగా నాగబాబు కి కౌంటర్ ఇచ్చిన సందర్భాలను మనమంతా చూసాము. దీంతో వీళ్ళ మధ్య గ్యాప్ ఊహించిన దానికంటే ఎక్కువ పెరిగింది అని అనుకున్నారు. అలా అనుకున్న వాళ్లందరికీ ఈరోజు జరిగిన ఈ సంఘటన మాస్ పంచ్ అనే చెప్పొచ్చు.
నాగబాబు ఇంటికి వెళ్ళిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ #AlluArjun #nagababu pic.twitter.com/8y3zUPezW4
— greatandhra (@greatandhranews) December 15, 2024