https://oktelugu.com/

Allu Ayaan : అల్లు అర్జున్ కొడుకు అయాన్ లో ఈ టాలెంట్ కూడా ఉందా… ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్!

అయాన్ కి మించిన చిచ్చర పిడుగు అర్హ. అల్లు అర్జున్ రెండో సంతానమైన అర్హ అంటే ఆయనకు మహా ఇష్టం. ఇంట్లో ఖాళీగా ఉంటే అర్హతో ఆడుకుంటారు. అర్హను సరదా ప్రశ్నలు అడుగుతుంటారు.

Written By:
  • NARESH
  • , Updated On : February 24, 2024 / 08:50 PM IST
    Follow us on

    Allu Ayaan : అల్లు అర్జున్ కి క్యూట్ ఫ్యామిలీ ఉంది. 2011లో స్నేహారెడ్డిని అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. 2014లో కొడుకు అయాన్ పుట్టాడు. అయాన్ చాలా యాక్టీవ్. తండ్రితో పాటు అప్పుడప్పుడు షూటింగ్ సెట్స్ కి వెళతాడు. సందడి చేస్తాడు. అయాన్ అల్లరిని అందరూ ఎంజాయ్ చేస్తారు. అల వైకుంఠపురంలో మూవీ సెట్స్ లో అయాన్ అల్లరికి సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్ అయ్యింది. కాగా అయాన్ లో సింగింగ్ టాలెంట్ కూడా ఉందని తాజాగా వెలుగులోకి వచ్చింది.

    అయాన్ పాట పడుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ డంకీ చిత్రంలోని ‘లుట్ ఫుట్ గయా’ సాంగ్ కి పాడాడు. అయాన్ క్యూట్ వీడియో చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్… మురిసిపోతున్నారు. అయాన్ సింగర్ కూడానా… అని కామెంట్స్ పెడుతున్నారు. అల్లు అర్జున్ నట వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ని దున్నేయడం ఖాయం అంటున్నారు. స్నేహారెడ్డి తరచుగా తన పిల్లల టాలెంట్ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.

    అయాన్ కి మించిన చిచ్చర పిడుగు అర్హ. అల్లు అర్జున్ రెండో సంతానమైన అర్హ అంటే ఆయనకు మహా ఇష్టం. ఇంట్లో ఖాళీగా ఉంటే అర్హతో ఆడుకుంటారు. అర్హను సరదా ప్రశ్నలు అడుగుతుంటారు. అర్హ అప్పుడే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది. గత ఏడాది విడుదలైన శాకుంతలం చిత్రంలో బాల భరతుడు పాత్ర చేసింది. శకుంతల-దుష్యంతుడు కుమారుడైన భరతుడిగా అర్హ నటించింది. చివర్లో వచ్చి మెరుపులు మెరిపించింది. శాకుంతలం మూవీలో అర్హ నటనకు ప్రశంసలు దక్కాయి.

    అల్లు అర్జున్ పిల్లలు అర్హ, అయాన్ ఒకరికి మించి ఒకరు అన్నట్లున్నారు. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప 2 పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2 ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న విడుదల కానుంది. అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో పుష్ప 2 తెరకెక్కుతుంది. రష్మిక మందాన హీరోయిన్ గా నటించింది. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.