
సోషల్ మీడియా వచ్చాక సినిమాలకు లీకులు బెడద ఎక్కువైంది. ఈరోజు రిలీజ్ అయిన సినిమా సాయంత్రానికి పైరసీ వెబ్ సైట్లలో వచ్చేస్తుంది. ఆ సినిమా దృశ్యాలు మొబైల్ లో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఇక ఈ మధ్య కాలంలో షూటింగ్ ల సమయంలోనే సీన్స్, ఫొటోలు, వీడియోలు తీసి కొందరు ప్రబుద్దులు లీక్ చేస్తున్నారు. ఇప్పటికే ప్యాన్ఇండియా ప్రాజెక్టుగా వస్తున్న ‘పుష్ప’ మూవీ నుంచి కొన్ని ఫొటోలు, పాట ముందే లీక్ కావడం టీం యూనిట్ ను షాక్ కు గురిచేశాయి. దీనిపై చిత్ర నిర్మాతలు ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజాగా ‘పుష్ప’ మూవీ నుంచి మరో వీడియో లీకైంది. ఇందులో ఏకంగా అల్లు అర్జున్ ఫైటింగ్ చేస్తున్న సీన్లు కనిపించడం అందరినీ చిత్రం యూనిట్ ను షాక్ కు గురిచేసింది.
పుష్ప సినిమాలోని ఎంతో ముఖ్యమైన ఫైటింగ్ సీన్ లీక్ కావడం సంచలనమైంది. అల్లు అర్జున్ స్టైలిష్ యాక్షన్ తో ఫైట్ చేయడం ఈ వీడియోలో కనిపించింది. భుజంపై కుర్చీని పట్టుకొని లుంగీ కట్టుకోవడం ఈ సినిమాలోని మాస్ అర్జున్ తీవ్రతను చూపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోసల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై అల్లు అర్జున్ అభిమానులు మండిపడుతున్నారు.కానీ మిగతా వారు మాత్రం తెగ షేర్లు చేస్తున్నారు.
ఇక ఎడిటింగ్ రూమ్ లోంచి మరో వీడియో లీక్ అయ్యింది. ఈ సీన్ కు రికార్డింగ్ పూర్తి కాగా.. ఎవరో దాన్ని తీసి సోషల్ మీడియాలో లీక్ చేశారు. ఈ మూవీ యూనిట్ నుంచే లీకులు బయటకు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇదంతా ఇంటిదొంగల పనినే అని నిర్మాతలు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు.
https://twitter.com/pawankalyan_09/status/1426960574030647298?s=20
ప్రస్తుతం పుష్ప మూవీ నుంచి లీకైన రెండు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
https://twitter.com/_AlluArjunFC/status/1426166007765225481?s=20