Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 ‘ చిత్రం నెల రోజుల క్రితం విడుదలై ఇప్పటికీ థియేటర్స్ డీసెంట్ వసూళ్లతో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సుమారుగా 1850 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. వసూళ్లకు మరింత బూస్ట్ ని అందించేలా ఈ నెల 11వ తేదీ నుండి రీ లోడెడ్ వెర్షన్ ని థియేటర్స్ లో ప్రదర్శిస్తామని మొన్న మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు. రీ లోడెడ్ వెర్షన్ అంటే దాదాపుగా 20 నిమిషాల అదనపు సన్నివేశాలు అన్నమాట. ఇప్పటికే ఈ చిత్రం మూడు గంటల సమయానికి మించి ఉంది. ఇప్పుడు ఈ 20 నిమిషాల సన్నివేశాలు కారణంగా 3 గంటల 20 నిముషాలు, ఇంటర్వెల్ తో కలిపి మొత్తం మీద 3 గంటల 40 నిమిషాలు. అంటే యావరేజ్ ఈ సినిమాని థియేటర్ లో చూసి ఇంటికి తిరిగి రావాలంటే నాలుగు గంటల సమయం పడుతుంది.
అభిమానులు మేకర్స్ ఈ ప్రకటన చేసిన వెంటనే సంబరపడ్డారు. సంక్రాంతికి మరోమారు థియేటర్స్ కి వెళ్లి ఈ సినిమాని చూద్దాం అనుకున్నారు. కానీ మేకర్స్ నేడు ఈ ఆలోచనని వాయిదా వేస్తున్నట్టు అధికారిక ప్రకటన చేసారు. జనవరి 17 నుండి రీ లోడెడ్ వెర్షన్ థియేటర్స్ లో అందుబాటులోకి ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇదంతా రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్ ‘ చిత్రం కోసమే చేసారని అభిమానులు అనుకుంటున్నారు. మన తెలుగు సినిమా స్థాయిని పెంచే సత్తా ఉన్నటువంటి మరో సినిమా రేపు విడుదల కాబోతుండడంతో దానికి అడ్డుగా వచ్చేందుకు ఇష్టపడక ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ, ఇదే నిజమైతే రామ్ చరణ్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య సోషల్ మీడియా లో ఫ్యాన్ వార్స్ దాదాపుగా తగ్గిపోతాయి.
ఇద్దరు సరిసమానమైన స్థానాల్లో ఉన్నందున ఈ ఇరువురి హీరోల అభిమానుల మధ్య పరస్పరం మా హీరో గొప్ప అంటే, మా హీరో గొప్ప అంటూ గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈమధ్య అది తారాస్థాయికి చేరుకుంది. రేపు ‘గేమ్ చేంజర్’ చిత్రం విడుదల సందర్భంగా ఈ గొడవలు ఇంకా తారాస్థాయికి చేరుకోవచ్చు. ఇలాంటి వార్తలు సోషల్ మీడియా లోకి వచ్చినప్పుడు కాస్త గొడవలు చల్లారే అవకాశాలు ఉంటాయి. అదే విధంగా రీసెంట్ గా రామ్ చరణ్ ‘అన్ స్టాపబుల్ 4 ‘ ఎపిసోడ్ కి ముఖ్య అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో అల్లు అరవింద్ గురించి ఆయన మాట్లాడిన మాటలు చూసేవాళ్లకు ఎంతో మంచిగా అనిపించింది. చిన్నప్పుడు మమ్మల్ని ఎక్కడికి తీసుకొని వెళ్లాలన్నా మా మామయ్య అల్లు అరవింద్ తీసుకెళ్ళేవాడు. గంటలు గంటలు మాకోసం ఎదురు చూసేవాడు. ఇప్పటికీ నాకు ఏమైనా కావాలంటే మామయ్య నే ధైర్యం గా అడుగుతాను అంటూ చెప్పుకొచ్చాడు.