Allu Arjun-18 Pages Pre Release Event: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ప్రతీ సూపర్ స్టార్ కి ఒక పీక్ పీరియడ్ ఉంటుంది..ఎక్కడ చూసిన వాళ్ళ మ్యానియా నే కనిపిస్తాది..ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలాంటి పీరియడ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.. పుష్ప సినిమా తో ఆయన ఇండియా వైడ్ అలాంటి ప్రభంజనం సృష్టించాడు.. కానీ పీక్ పీరియడ్ లో ఎలా ప్రవర్తించామనేదే ముఖ్యం..అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టేసరికి ఏదో ఆకాశం నుండి ఊడిపడిన దేవుడు లాగా తనని తానూ ప్రొజెక్ట్ చేసుకోవడం సొంత అభిమానులకు కూడా చిరాకు కలిగించేలా చేస్తోంది.ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ అని వాళ్లకి కూడా అనిపిస్తుంది..

ఏదైనా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వస్తే చాలు..ఆయన చేసే అతి మామూలు రేంజ్ లో ఉండదు..అనవసరమైన బిల్డప్స్ తన పీఆర్ టీం తో చెప్పి మరీ చేయించుకుంటాడు.. ఇతనిని ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి పిలవాలంటేనే భయపడిపోతున్నారు యువ హీరోలు.
ఇక అసలు విషయానికి వస్తే.. ‘కార్తికేయ 2 ‘ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నిఖిల్ హీరో గా నటించిన చిత్రం ’18 పేజెస్’.. ఈ సినిమా ఈ నెల 23 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతోంది.. గీత ఆర్ట్స్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించాడు.. నిన్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ ప్రవర్తన..అతని PR టీం వేసిన వేషాలు అభిమానులకు సైతం చిరాకు కలిగించేలా చేసాయి..కార్వాన్ దిగి లోపలకి వచ్చే వరకు హైదరాబాద్ లో GHMC వర్కర్స్ వేసుకునే యూనిఫార్మ్స్ ని కొంతమంది పైడ్ ఆర్టిస్ట్స్ కి వేయించి డ్యాన్స్ చేయిస్తూ లోపలకి అల్లు అర్జున్ ను అడుగుపెట్టించారు.

ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ ట్రోల్ అయిపోతుంది..క్రింద ఆ వీడియో ని మీరు కూడా చూడొచ్చు..చిరంజీవి , పవన్ కళ్యాణ్ చూసిన పీక్ రేంజ్ లో అల్లు అర్జున్ పావు శాతం కూడా చూసి ఉండదు..ఎంత పీక్ చూసినా కూడా వాళ్ళు ‘ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి’ అనే తత్త్వంతోనే ఉంటారు..అల్లు అర్జున్ వాళ్ళు ఉంటున్న కుటుంబంలోనే పెరిగి ఇలా ప్రవర్తించడం ఏంటో ఇప్పటికి అంతు చిక్కని ప్రశ్న.
Never before entry for in the history of World cinema pic.twitter.com/mGf2tfP600
— Sagar (@SagarPrabhas141) December 19, 2022
Ee pillapuk esalu maravu inka 😂😂 pic.twitter.com/W9HxOfYynW
— Bhavani Shankar (@Prabhas_Dhoni7) December 19, 2022