
Allu Arjun’s new look : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఆయన ఏమి చేసినా అది సెన్సేషన్ అయిపోతుంది, పుష్ప సినిమా తో పాన్ ఇండియా లెవెల్ లో ఆయన తెచ్చుకున్న క్రేజ్ ఏ హీరోకి అయినా ఒక డ్రీం అనే చెప్పాలి.ప్రస్తుతం ఇండియన్ మూవీ లవర్స్ మరియు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మొత్తం ‘పుష్ప : ది రూల్’ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 8 వ తారీఖున ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చెయ్యబోతున్నారు.మూడు నిమిషాల యాక్షన్ టీజర్ గా చెప్తున్న ఈ వీడియో తో మూవీ పై అంచనాలు ఎవ్వరూ ఊహించని స్థాయికి వెళ్తుందని అంటున్నారు.ఇది ఇలా ఉండగా రీసెంట్ ఒక యాడ్ షూటింగ్ కోసం అల్లు అర్జున్ ముంబై కి వచ్చాడు.
ఈ సందర్భం ముంబై విమానాశ్రయం లో అల్లు అర్జున్ కనపడగానే బాలీవుడ్ మీడియా ఆయన ఫోటోలు తియ్యడానికి ఎగబడింది.ఎంతో స్టైలిష్ గా లాంగ్ హెయిర్ తో ఉన్న అల్లు అర్జున్ ని చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.అయితే ‘పుష్ప: ది రూల్’ లో అల్లు అర్జున్ చాలా ఊర మాస్ లుక్ లో కనిపించాలి కదా, ఎందుకు ఇంత స్టైలిష్ గా ఉన్నాడు అంటూ అభిమానులు సందేహిస్తున్నారు.
అయితే ఇదంతా కేవలం ఒక యాడ్ షూటింగ్ కోసం తయారు చేయించుకున్న గెటప్ అని తెలుస్తుంది.స్టైలింగ్ లో అల్లు అర్జున్ ని బీట్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరని అభిమానులు అంటూ ఉంటారు.ఈ లుక్ చూసిన తర్వాత అది నూటికి నూరుపాళ్ళు నిజమే అనే విషయం అర్థం అవుతుంది .ఈ లుక్ తో అల్లు అర్జున్ ని ఒక్క సినిమా చేయమంటున్నారు ఫ్యాన్స్.