Allu Arjun: ఒకప్పుడు ఈయన హీరో నా అనే స్థాయి నుంచి ఇప్పుడు హీరో అంటే ఈయనే అనే స్టేజ్ కి ఎదిగిన ఒకే ఒక హీరో అల్లు అర్జున్…ఈయన తన అభిమానుల కోసం ఏదైనా చేస్తాడు వాళ్ళని అలరించడం కోసం ఎంత రిస్క్ అయిన చేస్తాడు… అయితే ఇలాంటి అల్లు అర్జున్ ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో ప్రేక్షకులకు తన డాన్స్ తో బాగా దగ్గరయ్యాడు. ఎలాంటి కష్టమైన స్టెప్స్ అయిన చాలా ఈజీ గా వేసేవాడు. ఇక ఆ డాన్స్ వల్లే ఇప్పుడు తనని అభిమానులు గుండెల్లో పెట్టుకొని చూసుకునే స్థాయికి ఎదిగాడు.
ఇక ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ గత రెండు మూడు సినిమాల నుంచి ఆయన అభిమానులకి నచ్చినట్టుగా డాన్స్ లు వేయట్లేదు అంటూ కొందరు అభిమానులు ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు ఆర్య 2 , ఇద్దరమ్మాయిలతో , జులాయి, రేసుగుర్రం లాంటి సినిమాల్లో ఎలాంటి స్టెప్పులు అయితే వేశాడో పుష్ప సినిమాలో అలాంటి స్టెప్పులు మిస్సయ్యాయి అంటూ ఆయన అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయాన్ని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా సుకుమార్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది.
మరి సుకుమార్ అల్లు అర్జున్ అభిమానులకి కలిగిన ఈ చిన్నపాటి లోటును తీర్చడానికి పుష్ప 2 లో ఒక అదిరిపోయే సాంగ్ కి అల్లు అర్జున్ చేత స్టెప్పులు వేయించాలని చూస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది….మరి ఈ సినిమాతో అల్లు అర్జున్ ప్రేక్షకులను తన ఫ్యాన్స్ ని ఎంతవరకు అలరిస్తాడో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే…ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో అన్ని రికార్డ్ లు బ్రేక్ అవుతాయంటు ఇప్పటికే సినిమా యూనిట్ మంచి కాన్ఫిడెంట్ గా ఉంది.
ఇక ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను పెంచేసింది. అందుకే ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు వేయి కన్నులతో ఎదురు చూస్తున్నారు… మరి ఇలాంటి క్రమం లో పుష్ప 2 సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.