https://oktelugu.com/

Varun Tej-Lavanya wedding : ఇటలీకి వెళ్తూ ఎయిర్ పోర్టులో మెరిసిన అల్లు అర్జున్ ఫ్యామిలీ.. ఎలా తయారయ్యారో తెలుసా? వీడియో వైరల్..

ఈ సందర్భంగా వీరు ఇటలీలో ఉన్న ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దు ఓ కాఫీ షాపులో ఉన్న ఫొటో ఆకట్టుకుంటోంది.

Written By:
  • NARESH
  • , Updated On : October 29, 2023 / 10:25 AM IST
    Follow us on

    Varun Tej-Lavanya wedding : మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్యల వివాహం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కావడంతో వివాహ వేడుక పై ఆసక్తి నెలకొంది. నవంబర్ 1న ఈ సినీ కపుల్స్ ఇటలీలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబు ఫ్యామిలీ ఏర్పాట్లు చేసేందుకు అందరికంటే ముందుగానే ఇటలీ వెళ్లారు. ఆ తరువాత ఒక్కొక్క మెగా ఫ్యామిలీ ఆ దేశానికి పయనమవుతోంది. తాజాగా అల్లు అర్జున్ ఫ్యామిలీ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో మెరిసింది. తన సతీమణి స్నేహ తో కలిసి కనిపించి ఆకర్షించారు.

    వరుణ్ తేజ్, లావణ్యలు 2017 నుంచి ప్రేమించుకున్నారు. దాదాపు ఐదేళ్ల పాటు ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచారు. ఆ తరువాత ఇరువురు తమ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ ఏడాది జూన్ 9న వీరి నిశ్చితార్థం నాగబాబు ఇంట్లో అతికొద్ది మంది మధ్య నిర్వహించారు. ఆ తరువాత పెళ్లి వేడుకను ఇటలీలో నిర్వహించాలని నిర్ణయించారు. వీరి వివాహం రాచరిక సాంప్రదాయంలో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

    మెగా హీరో పెళ్లికి అతికొద్దిమందికి మాత్రమే ఆహ్వనం అందినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి చెందిన వారు మాత్రమే ఈ వేడుకకు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ముందుగా నాగబాబు ఫ్యామిలీ ఇటలీ పయనమైంది. ఆ తరువా 28న పవన్ కల్యాణ్ సతీమణితో కలిసి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించారు. పెద్దగా ఆడంబరం లేకుండా పవన్ సింపుల్ గా కనిపించడం విశేషం.

    తాజాగ బన్నీ ఫ్యామిలీ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించింది. అల్లు అర్జున్ తో పాటు స్నేహ లు ఇటలీ వెళ్తున్నట్లు కనిపించారు. అల్లు అర్జున్ బ్లాక్ టీషర్ట్, ఫుల్ స్టీవ్డ్ టీ షర్ట్, బ్లాక్ జాగర్స్, స్నీకర్స్ వేసుకున్నారు. అయతనో పాటు స్నేహరెడ్డి కూడా ఉన్నారు. ఆమె డెనిమ్ జాకెట్, డెనిమ్ ప్యాంట్స్, బ్లాక్ క్రాప్ టాప్వేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ తో పాటు నితిన్ ఫ్యామిలీ కూడా వెళ్తున్నట్లు తెలుస్తోంది.

    ఇదిలా ఉండగా అక్టోబర్ 30న ఫ్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించనున్నారు. మరుసటి రోజు మెహందీ ఫంక్షన్ చేస్తారు. ఇదే రోజు హల్దీ వేడుకలు జరుగుతాయి. ఆ తరువాత నవంబర్ 1న వరుణ్, లావణ్యలు పెళ్లి పీటలు ఎక్కుతారు. ఈ సందర్భంగా వీరు ఇటలీలో ఉన్న ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దు ఓ కాఫీ షాపులో ఉన్న ఫొటో ఆకట్టుకుంటోంది.