Mega vs Allu : మరింత సెగ రాజేసిన అల్లు అర్జున్, ఇక జరగబోయేది ఇదే!

మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ దూరం కావాలని చూస్తున్నాడంటూ చాలాకాలంగా వాదన ఉంది. తాజా పరిణామాలు దానికి మరింత బలం చేకూర్చుతున్నాయి. ఓ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరైన అల్లు అర్జున్ నాకు ఇష్టమైన వాళ్ళ కోసం ఎక్కడికైనా వెళతాను అన్నాడు. ఇది మెగా హీరోలకు అల్లు అర్జున్ కౌంటర్ అంటున్నారు.

Written By: S Reddy, Updated On : August 22, 2024 8:00 pm

Mega vs Allu

Follow us on

Mega vs Allu :మెగా హీరోలతో అల్లు అర్జున్ వివాదం ఇప్పటిది కాదు. సరైనోడు సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ పేరు పలకాలని ఫ్యాన్స్ డిమాండ్ చేయగా ఆయన ‘చెప్పను బ్రదర్’ అన్నారు. అదే వేదిక మీద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి క్లాస్ పీకాడు. అనంతరం విడుదలైన అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. ఆ చిత్ర ఫలితాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశాడు.

అప్పటి నుండి అల్లు అర్జున్ సపరేట్ ఫ్యాన్ బేస్ మైంటైన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఆర్మీ(AA) పేరుతో అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. మెగా హీరో ట్యాగ్ వదిలించుకోవాలనేది అల్లు అర్జున్ ప్రయత్నం అనే వాదన ఉంది. మెగా-అల్లు కుటుంబాల మధ్య దూరం పెరిగిందని గత ఐదేళ్లుగా వినిపిస్తుంది. ఈ పుకార్లను వారు కొట్టిపారేశారు.

ఇటీవల జరిగిన పరిణామాలతో ఈ విషయం తేటతెల్లమైంది. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో నంద్యాల అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి శిల్పా రవి ఇంటికి సతీసమేతంగా వెళ్లిన అల్లు అర్జున్ మద్దతు ప్రకటించాడు. వైసీపీ ప్రత్యర్థి పార్టీగా ఉన్న జనసేన, టీడీపీ, బీజేపీ దీన్ని జీర్ణించుకోలేకపోయాయి. పరోక్షంగా అల్లు అర్జున్ వైసీపీ పార్టీకి మద్దతు తెలిపినట్లు అయ్యింది.

దీన్ని నిరసిస్తూ నాగబాబు పోలింగ్ ముగిసిన సాయంత్రం అల్లు అర్జున్ పై ఇండైరెక్ట్ సెటైర్ వేశాడు. కాసేపట్లోనే ఆ ట్వీట్ ని నాగబాబు తొలగించాడు. అనంతరం సాయి దుర్గ తేజ్ అల్లు అర్జున్ ని సోషల్ మీడియా అకౌంట్స్ లో అన్ ఫాలో చేశాడు. చివరికి పవన్ కళ్యాణ్ కూడా అల్లు అర్జున్ పై తన అసహనం బయటపెట్టారు. కర్ణాటక పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్… గతంలో హీరోలు అడవులను పెంచి అభివృద్ధి చేసే పాత్రలు చేసేవారు. కానీ ఈ తరం హీరోలు వాటిని నరికి స్మగ్లింగ్ చేసే పాత్రలు చేస్తున్నారు. నటుడిగా నాకు అలాంటి పాత్రలు చేయడం ఇష్టం ఉండదు.. అన్నాడు.

ఈ కామెంట్స్ పుష్ప మూవీలో అల్లు అర్జున్ చేసిన పాత్రను ఉద్దేశించే అని క్లియర్ గా అర్థం అవుతుంది. పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై అల్లు అర్జున్ ఏ విధంగా స్పందించలేదు. తాజాగా దర్శకుడు సుకుమార్ భార్య ప్రజెంట్ చేస్తున్న మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు అల్లు అర్జున్ గెస్ట్ గా హాజరయ్యాడు. వేదికపై మాట్లాడుతూ.. ఫ్రెండ్స్ కోసం కావాల్సిన వాళ్ళ కోసం నేను ఎక్కడికైనా వస్తాను. నాకు ఇష్టమైతే వస్తాను… అన్నారు.

ఈ కామెంట్స్ మెగా హీరోలకు అల్లు అర్జున్ కౌంటర్ అనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఫ్యాన్స్ అల్లు అర్జున్-మెగా హీరోలు అనే కోణంలో విడిపోయి సోషల్ మీడియాలో మాటల దాడి చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ మరింత చిచ్చు రాజేసిన నేపథ్యంలో ఈ వార్ తీవ్ర రూపం దాల్చే సూచనలు కలవు..