https://oktelugu.com/

Allu Arjun : అల్లు అర్జున్ కు అదే మైనస్ అయ్యిందా? సినిమాల కంటే పొలిటికల్ పవరే గొప్పదని రుజువైందా?

పుష్ప -1 లో సునీల్ బామ్మర్దిని అల్లు అర్జున్ చంపేస్తాడు. ఆ తర్వాత పంచాయితీ జరుగుతుంది. దానికి రావు రమేష్ వస్తాడు. ఆ సమయంలో పుష్పకు సపోర్ట్ గా ఉంటాడు. అక్రమ దందాలో కూడా పొలిటికల్ పవరే గొప్పదని నిరూపిస్తాడు. అక్కడిదాకా ఎందుకు పుష్ప -2 లో పొలిటికల్ పవర్ కోసమే అల్లు అర్జున్ రావు రమేష్ ను రాజకీయంగా పైకి లేపుతాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 13, 2024 / 06:19 PM IST

    Allu Arjun

    Follow us on

    Allu Arjun :  ఈ దృశ్యాలు సినిమాటిక్ గా అనిపించినప్పటికీ.. రియల్ లైఫ్ లో పొలిటికల్ పవర్ అంతకుమించి పవర్ఫుల్. అది అల్లు అర్జున్ కు శుక్రవారం నాటి అరెస్టు ఎపిసోడ్ తో పూర్తిగా అర్థమయ్యే ఉంటుంది. సంధ్య థియేటర్ ఘటనలో రేవతి మరణానికి తనకు ఎటువంటి సంబంధం లేదని అల్లు అర్జున్ చెప్పినప్పటికీ.. తెలంగాణ పోలీసులు ఊరుకోలేదు. సెలబ్రిటీ అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులు ఉండవని తెలంగాణ పోలీసులు నిరూపించారు. వాస్తవానికి సినిమా హీరోలకు బయట ఫ్యాన్ క్రేజ్ ఉంటుంది. అంతకుమించి అనేలాగా పొలిటికల్ లీడర్లకు పవర్ ఉంటుంది. రూలింగ్ లో ఉంటే ఆ పవర్ ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. దాని రేంజ్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి చిరంజీవి పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చారు. అంతకుముందు ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సుదీర్ఘకాలం పోరాటం చేసి, చివరికి ఉప ముఖ్యమంత్రి అయ్యారు.. పుష్ప సినిమా తర్వాత తన క్రేజ్ పెరిగిపోవడంతో పొలిటికల్ పవర్ కంటే తన ఫ్యాన్ ఆర్మీ గొప్పదని అల్లు అర్జున్ భావించి ఉండవచ్చు. అందువల్లే పుష్ప సినిమా సక్సెస్ మీట్ లో తెలంగాణ ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించి ఉండకపోవచ్చు. అది ఆ క్షణం అల్లు అర్జున్ కు చిన్న విషయమే అయినప్పటికీ.. రాజకీయ నాయకులకు చిన్న విషయం కాదు. మరీ ముఖ్యంగా రూలింగ్ లో ఉన్న నాయకులకు అస్సలు చిన్న విషయం కాదు.

    కౌంటర్ వేసేంత సన్నివేశం ఉందా

    పుష్ప సినిమాకి సంబంధించి టికెట్ ధరలను నిర్మాతలు తమ ఇష్టం వచ్చినట్టు పెంచుకునేంత వెస్సలు బాటును తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ రేవంత్ ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. ఇదే సమయంలో సంధ్య థియేటర్లో ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు గాయపడ్డాడు. అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘటనకు, తనకు ఎటువంటి సంబంధం లేదని అల్లు అర్జున్ ఒక వీడియో సందేశం ద్వారా పేర్కొన్నాడు. కానీ అప్పటికే తెలంగాణ ప్రభుత్వం చేయాల్సిన పని చేసుకుంటూ పోయింది. సినిమా ఫంక్షన్లకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లకు అనుమతులు ఇచ్చే విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తామని సంకేతాలు ఇచ్చింది. దాని మర్చిపోకముందే అల్లు అర్జున్ కు నోటీసులు పంపించింది. శుక్రవారం ఏకంగా అరెస్టు చేసింది. ఈ అరెస్టును అల్లు అర్జున్ కూడా ఊహించి ఉండకపోవచ్చు. ఎందుకంటే పెద్ద హీరోలకు సంబంధించి సినిమాల ముందస్తు వేడుకల్లో, ప్రీ రిలీజ్ ఫంక్షన్లలో గతంలో అనేక దుర్ఘటనలు జరిగాయి. అప్పుడు ఎటువంటి పోలీస్ కేసులు నమోదు కాలేదు. హీరోలు అరెస్టుకు గురి కాలేదు. కానీ ఇప్పుడు మాత్రం అల్లు అర్జున్ విషయంలో ఇందుకు విరుద్ధంగా జరిగింది. దీనిపై సినీ హీరోలు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ.. ఒక సెక్షన్ ప్రజల నుంచి అరెస్టు కోణంపై సానుకూల స్పందన లభించడం విశేషం.