https://oktelugu.com/

Pushpa: ప్రమోషన్స్​ కోసం రంగంలోకి దిగుతున్న ‘పుష్ప’రాజ్​

Pushpa: ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో మూవీ ప్రమోషన్స్ అనేవి ఒక ప్రెస్ మీట్ లేదా ఒక ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి తమ సినిమా గురించి‌ అభిమానులకు తెలిపేవారు. కానీ ప్రస్తుత కాలంలో సినిమాని టైటిల్ నుండి టీజర్ వరకు ప్రేక్షకుల్లో ఆ సినిమా పై భారీ అంచనాలు పెంచుతూ… పోస్టర్స్ నుండి గ్లింప్సె, సాంగ్స్ ,టీజర్ అంటూ ఒకటి తర్వాత ఒకటి విడుదల చేస్తూ అభిమానుల్లో ఆ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ని పెరిగేలా చేస్తున్నారు మేకర్స్. చిన్న […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 26, 2021 / 12:57 PM IST
    Follow us on

    Pushpa: ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో మూవీ ప్రమోషన్స్ అనేవి ఒక ప్రెస్ మీట్ లేదా ఒక ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి తమ సినిమా గురించి‌ అభిమానులకు తెలిపేవారు. కానీ ప్రస్తుత కాలంలో సినిమాని టైటిల్ నుండి టీజర్ వరకు ప్రేక్షకుల్లో ఆ సినిమా పై భారీ అంచనాలు పెంచుతూ… పోస్టర్స్ నుండి గ్లింప్సె, సాంగ్స్ ,టీజర్ అంటూ ఒకటి తర్వాత ఒకటి విడుదల చేస్తూ అభిమానుల్లో ఆ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ని పెరిగేలా చేస్తున్నారు మేకర్స్. చిన్న సినిమా నుండి పెద్ద సినిమా వరకు ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు అనే చెప్పాలి.

    అయితే ఇదే క్రమంలోనే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా తన సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల కోసం స్వయంగా అభిమానుల మధ్యలోకి రాబోతున్నాడట.సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత ఓ స్పెషల్ సాంగ్‌లో సందడి చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ – ముత్తం శెట్టి మీడియా కలిసి దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. అలానే సునీల్, అనసూయ భరద్వాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు.

    ఈ ఏడాది డిసెంబర్ 17న ‘పుష్ప ది రైజ్ పార్ట్ 1’ భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించనుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను ప్రారంభించబోతున్నారట. ఇందుకోసం అల్లు అర్జున్ స్వయంగా ‘పుష్ప’ సినిమా ప్రమోషన్స్‌కు హాజరై కొన్ని ప్రాంతాలలో సందడి చేయనున్నాడు.