Allu Arjun vs Sandeep Vanga: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun),సందీప్ వంగ(Sandeep Reddy Vanga) కాంబినేషన్ లో ఒక సినిమాని ప్రకటించి దాదాపుగా రెండేళ్లు కావొస్తుంది. కానీ ఇప్పటి వరకు అసలు ఈ సినిమా ఉందా?, లేదా అనే క్లారిటీ అభిమానుల్లో లేదు. ఎందుకంటే సందీప్ వంగ ఈ ప్రాజెక్ట్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడమే. అన్నిటికి మించి ఆయన అల్లు అర్జున్ పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు తెలియచేయలేదు. ఇక్కడే అందరికీ అర్థం అయిపోయింది. వీళ్ళ ప్రాజెక్ట్ రద్దు అయ్యింది అని. అదే సమయంలో రీసెంట్ గా రామ్ చరణ్, సందీప్ వంగ కాంబినేషన్ సెట్ అవ్వడం చూస్తుంటే అల్లు అర్జున్ తో అనుకున్న ప్రాజెక్ట్ ఇటు షిఫ్ట్ అయ్యిందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా జరిగిన ఒక సంఘటన అల్లు అర్జున్, సందీప్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది అనేందుకు ఉదాహరణ గా నిల్చింది.
వివరాల్లోకి వెళ్తే సందీప్ వంగ తన తదుపరి చిత్రం ‘స్పిరిట్'(Spirit Movie) లో హీరోయిన్ పాత్ర కోసం ముందుగా దీపికా పదుకొనే(Deepika Padukone) ని సంప్రదించాడు. కానీ ఆమె పెట్టిన డిమాండ్స్ నచ్చని సందీప్ ఆమెని ఆ చిత్రం నుండి తొలగించాడు. ఆ తర్వాత వీళ్ళ మధ్య పెద్ద సీన్ క్రియేట్ అయ్యింది. తనకంటే చిన్న హీరోయిన్ ని ఎంచుకున్నాననే పగతో స్పిరిట్ మూవీ స్టోరీ ని మొత్తం బయటపెట్టేసింది అంటూ సందీప్ వంగ దీపికా పై పరోక్షంగా వేసిన ఒక ట్వీట్ సంచలనంగా మారింది. దీపికా పదుకొనే కూడా అందుకు తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా రెస్పాన్స్ ఇచ్చింది. ఇలా వీళ్ళ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సమయంలోనే అకస్మాత్తుగా దీపికా పదుకొనే అల్లు అర్జున్ , అట్లీ సినిమాలో హీరోయిన్ గా నటించబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు.
Also Read: Allu Arjun : అల్లు అర్జున్ అట్లీ ని బ్లైండ్ గా నమ్ముతున్నాడా..?
ఇది కేవలం రూమర్ అయ్యుంటుందిలే అని చాలా మంది అనుకున్నారు. కానీ రీసెంట్ గానే దీపికా పదుకొనే ప్రాజెక్ట్ లోకి అధికారికంగా ఎంట్రీ ఇచ్చింది అంటూ ఒక వీడియో ని విడుదల చేశారు. అటు సందీప్ వంగ రిజెక్ట్ చేయడం,ఇటు అల్లు అర్జున్ వెంటనే ఆమెని తన సినిమాలోకి తీసుకోవడం, కచ్చితంగా ఇది యాదృచ్చికంగా జరిగింది కాదని విశ్లేషకుల అభిప్రాయం. కేవలం సందీప్ వంగ మీద కోపం తోనే అతనికి పరోక్షంగా సమాధానం చెప్తూ తన సినిమాలోకి అల్లు అర్జున్ తీసుకున్నాడని అందరూ అంటున్నారు. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే సందీప్ వంగ నోరు విప్పాల్సిందే. ఇకపోతే ప్రస్తుతం ఆయన ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. ఈ ఏడాది లోనే షూటింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టాలని చూస్తున్నాడు కానీ అది సాధ్యం అయ్యేలా ప్రస్తుతానికి కనిపించడం లేదు.