Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ గత నెల రోజులుగా కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ మరియు పుష్ప మూవీ టీం కలిపి రెండు కోట్ల రూపాయిలు ఆర్ధిక సాయం చేసారు. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కూడా శ్రీ తేజ్ తండ్రి భార్గవ్ కి ఇండస్ట్రీ లో పని కల్పిస్తానని మాట ఇచ్చాడు. ఇటీవలే రెగ్యులర్ బెయిల్ ని అందుకున్న అల్లు అర్జున్ శ్రీ తేజ్ ని కలిసేందుకు అనుమతిని కోరగా, పోలీసులు పలు ఆంక్షలు విధించి నేడు శ్రీ తేజ్ ని కల్పించారు. కిమ్స్ హాస్పిటల్ కి వెళ్లే ముందు తమకి సమాచారం అందించాలని రామ్ గోపాల్ పేట పోలీసులు సమాచారం ఇవ్వాలని అల్లు అర్జున్ కి ఒక రోజు ముందు నోటీసులు అందించగా, నేడు భారీ బందోబస్తు నడుమ శ్రీతేజ్ ని కలిపించారు పోలీసులు. అల్లు అర్జున్ తో పాటు దిల్ రాజు కూడా వచ్చాడు.
దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. మీడియా కి సమాచారం అందిస్తే భారీ ఎత్తున జనాలు వచ్చే అవకాశం ఉండడంతో గోప్యంగా ఉంచేందుకే పోలీసులు ప్రయత్నం చేసారు. కానీ సోషల్ మీడియా లో ఈ సమాచారం బాగా వ్యాప్తి చెందడంతో అభిమానులు అప్పటికే కిమ్స్ హాస్పిటల్ వద్ద భారీ గా చేరుకున్నారు. భారీ బందోబస్తు ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణం లోనే వీళ్లిద్దరి మీటింగ్ జరిగింది. అల్లు అర్జున్ ని ఇన్ని రోజులు శ్రీతేజ్ ని కలుసుకోలేదని నెటిజెన్స్ కొంతమంది ఆయన్ని తప్పుబట్టి విమర్శలు చేసారు. కానీ నేడు అల్లు అర్జున్ పోలీసులు ఇన్ని ఆంక్షలు విధించినా శ్రీ తేజ్ ని కలుసుకోవడం తో అల్లు అర్జున్ మనసు ఎంత గొప్పది అనేది అర్థం చేసుకున్నారు నెటిజెన్స్.
BREAKING: Allu Arjun finally visits Pushpa 2⃣ Sandhya theatre stampede victim Sri Tej at KIMS Hospital. pic.twitter.com/Sy99y6q558
— Manobala Vijayabalan (@ManobalaV) January 7, 2025