Homeఎంటర్టైన్మెంట్Allu Arjun Visits Shankarpally MRO Office: ఎమ్మార్వో కార్యాలయంలో సందడి చేసిన ఐకాన్ స్టార్...

Allu Arjun Visits Shankarpally MRO Office: ఎమ్మార్వో కార్యాలయంలో సందడి చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

Allu Arjun Visits Shankarpally MRO Office: సినిమా సెలబ్రిటీ మీ ప్రాంతంలోకి సాధారణ వ్యక్తిలాగా వస్తే ఎలా ఉంటుంది, సరిగ్గా అలాంటి అనుభూతే శంకర్‌పల్లిలోని ఎమ్మార్వో కార్యాలయంలో జరిగింది. టాలీవుడ్ ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ పుష్ప షూటింగ్‌తో బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈరోజు ఆయన రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి తశీల్దార్‌ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. మండలంలోని జన్వాడ గ్రామంలో రెండెకరాల భూమిని బన్నీ ఇటీవల కొనుగోలు చేశారు. కాగా, ఆ భూమి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ పనులకై ఈరోజు ఉదయం ఆయన శంకర్‌పల్లి ఎమ్మార్వో ఆఫీస్‌కు వెళ్లారు.

 

Allu Arjun Visit Shankarpally MRO Office

ప్రకృతి ప్రేమికుడైన బన్నీ ఈ భూమిని వ్యవసాయ క్షేత్రంగా మార్చి, తీరిక సమయాల్లో కుటుంబంతో కాలక్షేపం చేయడం కోసం  కొన్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీ రాకతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది.  కార్యాలయంలోని ఉద్యోగులు ఆయనతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు. మరోవైపు, బన్నీ రాక గురించి తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో తహశీల్దార్‌ ఆఫీస్‌ వద్దకు తరలివచ్చారు. దీంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రిజిస్ట్రేషన్‌ పనులు పూర్తైన వెంటనే కొంతమందితో ఫొటోలు దిగిన ఆయన మళ్లీ హైదరాబాద్‌కు వచ్చేశారు. మరోవైపు జూలై నెలలో జూనియర్ ఎన్టీఆర్‌ కూడా శంకర్‌పల్లి మండల పరిధిలో ఆరున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చి సందడి చేసిన విషయం తెలిసిందే.

 

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version