
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా బారిన పడి ప్రస్తుతం ఇంట్లోనే హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జరిపిన పరీక్షలలో బన్నీకి కరోనా నెగెటివ్ వచ్చిందని సమాచారం. ఈ మేరకు అల్లు అర్జున్ స్వయంగా ట్వీట్ చేశాడు.
బన్నీ తాజాగా ట్వీట్ చేస్తూ ‘అందరికీ హాయ్. 15 రోజుల క్వారంటైన్ అనంతరం ఇప్పుడు జరిపిన టెస్టులలో కరోనా నెగెటివ్ గా వచ్చింది. నాకోసం ప్రార్థించిన అభిమానులకు, సన్నిహితులకు ధన్యవాదాలు.. కరోనా కేసులు తగ్గడానికి ఈ లాక్ డౌన్ పనిచేస్తుందని నమ్ముతున్నా.. బీహోం.. బీ సేఫ్’ అంటూ బన్నీ ట్వీట్ చేశాడు.
కొన్ని రోజుల క్రితం తనకు కరోనా సోకిందని బన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. స్వల్ప లక్షణాలే ఉన్నాయని తెలిపాడు. కానీ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్టు ప్రకటించారు.
కరోనా టైంలోనూ పుష్ప సినిమా షూటింగ్ లో పాల్గొన్న అల్లు అర్జున్ నాడే కరోనా బారిన పడ్డారు.అప్పటి నుంచి క్వారంటైన్ లో ఉన్నారు. తాజాగా కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.