Allu Arjun: సినిమా అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది… కొందరు 100 రూపాయిలు పెట్టి సినిమా చూడటానికి ఇష్టపడితే మరికొందరు సినిమా తీయడానికి ఆసక్తి చూపిస్తారు… నిజానికి ఇండస్ట్రీకి రావాలని అందరికి ఉంటుంది. కానీ ఇక్కడి పరిస్థితులను తట్టుకొని నిలబడటం అంత ఈజీ కాదు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు భరించాల్సి ఉంటుంది…ఎవరైతే వీటన్నింటిని భరించి వాళ్ళ సత్తా చాటుతారో వాళ్ళు మాత్రమే టాప్ లెవల్ కి వెళ్తారు… ఇక సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న కూడా ఇక్కడ ముందుకు వెళ్లడం అంత ఈజీ కాదు…టాలెంట్ ఉంటేనే ఇక్కడ రాణిస్తారు…ఇక తన సొంత టాలెంట్ తో ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ వచ్చిన నటుడు అల్లు అర్జున్…
ఆయన చేసిన సినిమాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి…’పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు… అలాంటి నటుడు చేసిన రెండు సినిమాలు ఒక ఇద్దరు స్టార్ హీరోల సినిమాల వల్ల ప్లాప్ అయ్యాయనే విషయం మనలో చాలా మందికి తెలీదు…అందులో మొదటిది బద్రీనాథ్ సినిమా కాగా, రెండోది రుద్రమదేవి సినిమా కావడం విశేషం…
బద్రీనాథ్ సినిమా కథ పరంగా ఒకే అనిపించినప్పటికి అది విజువల్ గా మగధీర కి కాపీ ల ఉంది అంటూ చాలా కామెంట్స్ వచ్చాయి…దాంతో ఆ మూవీ ప్లాప్ అయింది…ఇక రుద్రమదేవి మూవీ లో ఆయన చేసిన గోనగన్నారెడ్డి పాత్ర కి మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఆ మూవీని బాహుబలి తో పోల్చడం విజువల్ గా అంత క్వాలిటీగా లేకపోవడంతో ఆ మూవీ కూడా అనుకున్నంత రేంజ్ లో ఆడలేదు…
దాంతో అల్లు అర్జున్ హానెస్ట్ గా చేసిన రండు సినిమాలు రామ్ చరణ్, ప్రభాస్ సినిమాలతో పోల్చడం వల్ల ప్లాప్ అయ్యాయి…ఈ విషయాన్ని అల్లు అర్జున్ సైతం పలు సందర్భాల్లో గుర్తుచేసుకున్నాడు…ఇక ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో మరోసారి టాప్ రేంజ్ లోకి వెళ్ళబోతున్నాడు అనేది స్పష్టంగా తెలుస్తోంది…