Allu Arjun And Trivikram: ‘గంగోత్రి’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన అల్లు అర్జున్ ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. అయినప్పటికి అతని కెరియర్ కి ఏ మాత్రం యూజ్ అవ్వలేదు. ఇక ఆ తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో చేసిన ఆర్య సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు. అప్పటి నుంచి స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక ఐడెంటిటి సంపాదించుకున్న అల్లు అర్జున్ ఆ తర్వాత కాలంలో కూడా వరుస సినిమాలను చేస్తూ తనదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. అలాంటి అల్లు అర్జున్ ఇప్పటివరకు డిఫరెంట్ సినిమాలను చేయడమే కాకుండా పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో స్టార్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం తెలుగు నుంచి అత్యధిక కలెక్షన్స్ ని కొల్లగొట్టిన సినిమా కూడా పుష్ప 2 సినిమానే కావడం విశేషం…
ఈ సినిమా 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక ఇలాంటి క్రమంలోనే అల్లు అర్జున్ తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాడు. ఇప్పటికే అట్లీ, లోకేష్ కనకరాజులతో సినిమాలను కమిట్ అయిన తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది.
అయితే ఇది ఒక పిరియాడికల్ డ్రామా 1980 బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కబోతుందట. ఇప్పటివరకు త్రివిక్రమ్ పీరియాడికల్ డ్రామా సినిమాని చేయలేదు. కాబట్టి ఈ సినిమా త్రివిక్రమ్ లోని ఒక కొత్త యాంగిల్ బయటకు తీయబోతుంది అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. అల్లు అర్జున్ సైతం ఆ కథను విని కథ సూపర్ గా ఉందని చెప్పాడట.
మొత్తానికైతే త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకి మరో రెండు సంవత్సరాల సమయం అయితే పట్టే అవకాశం ఉంది. ఈలోపు త్రివిక్రమ్ వెంకటేష్ అలాగే ఎన్టీఆర్ తో సినిమాలను పూర్తి చేసుకోవాలని ప్రయత్నంలో ఉన్నాడు… ఇక అట్లీ, లోకేష్ కనకరాజు సినిమాలు ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తాయి అనేదానిమీదనే అల్లు అర్జున్ తన తదుపరి సినిమాలను ఎవరితో చేస్తారనేది డిసైడ్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది…
