https://oktelugu.com/

Allu Arjun : పేరు మార్చుకోనున్న అల్లు అర్జున్..? ఇకపై అలా పిలవొద్దు అంటూ కుటుంబ సభ్యులు కఠిన నిర్ణయం!

గత నెల మొత్తం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు దేశవ్యాప్తంగా ఏ రేంజ్ లో మారుమోగిపోయిందో మనమంతా చూస్తూనే ఉన్నాం.

Written By:
  • Vicky
  • , Updated On : January 4, 2025 / 03:45 PM IST

    Allu Arjun

    Follow us on

    Allu Arjun : గత నెల మొత్తం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు దేశవ్యాప్తంగా ఏ రేంజ్ లో మారుమోగిపోయిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ‘పుష్ప 2 ‘ సంచలన విజయం సాధించి రెండు వేల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్ల వైపు పరుగులు తీయడం ఒక ఎత్తు అయితే, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన మరో ఎత్తు. ఈ ఘటనలో రేవతి అనే యువతీ చనిపోవడం, ఆమె కొడుకు ఇప్పటికీ కిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందడం, అల్లు అర్జున్ ని ఈ ఘటనపై బాధ్యుడిని చేస్తూ అరెస్ట్ చేయడం వంటి సంఘటనలు పెను దుమారమే రేపాయి. నిన్న అల్లు అర్జున్ కి ఈ కేసు విషయం లో రెగ్యులర్ బెయిల్ రావడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకొని సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ ఘటన తర్వాత అల్లు అర్జున్ లో చాలా మార్పులు చోటు చేసుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.

    ఇక నుండి తనని ఐకాన్ స్టార్, స్టైలిష్ స్టార్, పాన్ ఇండియన్ స్టార్ అని పిలవడం ఆపేయాలని అభిమానులను ఆయన త్వరలో కోరుకునే అవకాశాలు ఉన్నాయట. ఈ మేరకు ఆయన తన కుటుంబ సభ్యులతో కూడా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అంతే కాకుండా సంధ్య థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ గురించి ప్రస్తావన వస్తే, ప్రతీ ఒక్కరు తొక్కిసలాట ఘటన గురించే ముందుగా మాట్లాడుతుండడం అల్లు అర్జున్ కి కాస్త ఇబ్బందిని గురి చేస్తుందట. ఈ విషయం పై ఆయన తన సోషల్ మీడియా ద్వారా మీడియా కి రిక్వెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. దేశం మొత్తం పుష్ప 2 మూవీ సక్సెస్ ని ఒక రేంజ్ లో సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం చేసుకోలేకపోయాడు. ఇది ఆయన అభిమానులకు కాస్త నిరాశకి గురి చేసిన విషయం.

    ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి తన క్యారక్టర్ గురించి అసెంబ్లీ సాక్షిగా తప్పుగా మాట్లాడడం పై అల్లు అర్జున్ ఇప్పటికీ తీసుకోలేకపోతున్నాడట. అందుకే బాధతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే అల్లు అర్జున్ త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోయే సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఆ చిత్రం కోసం సరికొత్త లుక్ లోకి మారేందుకు హోమ్ వర్క్ మొదలు పెట్టాడట. సుమారుగా 500 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ చిత్రం లో అల్లు అర్జున్ గుబురు గడ్డం, పొడవాటి జుట్టుతో కనిపిస్తాడట. ఇప్పటి వరకు అభిమానులు ఎప్పుడూ చూడని రేంజ్ లో అల్లు అర్జున్ కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాతో పాటు గత రెండు మూడు రోజులుగా కొరటాల శివ తో ఒక సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నారట. అట్లీ, సందీప్ రెడ్డి వంగ వంటి వారితో కూడా అల్లు అర్జున్ సినిమాలు ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే.