Allu Arjun: ప్రస్తుతం ఇండియా లో క్రేజ్ పరంగా, ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా, రికార్డ్స్ పరంగా నెంబర్ 1 సూపర్ స్టార్ ఎవరూ అని అడిగితే మన అందరికీ గుర్తుకొచ్చే పేరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun). ‘పుష్ప 2′(Pushpa 2) చిత్రంతో ఏకంగా ఆయన బాహుబలి 2 రికార్డ్స్ ని బద్దలు కొట్టి సంచలనం సృష్టించాడు. రాజమౌళి(SS Rajamouli) సహకారం లేకుండా ఇండియన్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన హీరోగా సరికొత్త రికార్డుని నెలకొల్పాడు. అలాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ తో కలిసి నటించాలని ఏ హీరోయిన్ కి మాత్రం ఉండదు చెప్పండి?, చిన్న క్యారక్టర్ దొరికినా ఎగబడతారు, అదృష్టం గా భావిస్తారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ(Director Atlee) తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఒక స్టార్ హీరోయిన్ ని అడిగితే డేట్స్ లేవని ముఖం మీదనే చెప్పేసిందట.
Also Read: పాత చింతకాయ పచ్చడిలా అనిపించిన ‘అర్జున్ S/O వైజయంతి’ ట్రైలర్..!
ఆ హీరోయిన్ మరెవరో కాదు, ప్రియాంక చోప్రా(Priyanka Chopra). బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రెండు దశాబ్దాలు కొనసాగిన ఈమె, హాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అక్కడ పలు వెబ్ సిరీస్ లు, సినిమాలలో హీరోయిన్ గా, విలన్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలను చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ని తెచ్చుకుంది. హాలీవుడ్ లో ఈమె ఒక సినిమాకు తీసుకునే రెమ్యూనరేషన్ తో ఒక మీడియం రేంజ్ సినిమా తీసేయోచ్బు. అలాంటి హీరోయిన్ ని తమ సినిమా కోసం తీసుకుంటే బాగుండుంటుంది అని అనుకున్నాడు డైరెక్టర్ అట్లీ. కానీ ప్రియాంక చోప్రా మాత్రమ్ చేయలేనని డైరెక్ట్ గా చెప్పేసిందట. కారణం ఆమె మహేష్, రాజమౌళి సినిమాలో నటిస్తుండడమే. రీసెంట్ గానే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఒడిశాలో మొదలై పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ మొత్తంలో ప్రియాంక చోప్రా పాల్గొన్నది. ఇందులో మెయిన్ విలన్ క్యారక్టర్ లో కనిపించబోతుందని టాక్.
రాజమౌళి సినిమా ఒప్పుకున్న తర్వాత హీరో అయినా, హీరోయిన్ అయినా సినిమా పూర్తి అయ్యేవరకు మరో సినిమా షూటింగ్ లో పాల్గొనకూడదు. అందుకే ప్రియాంక చోప్రా చేయలేనని అట్లీ తో చెప్పిందట. అయితే ఈమె అల్లు అర్జున్, అట్లీ సినిమాలో నటించబోతుంది అనే వార్త రావడంతో అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ జోడీ సిల్వర్ స్క్రీన్ పై ఏ మాత్రం సరిపోదు, అల్లు అర్జున్ పక్కన ప్రియాంక చోప్రా పెద్ద వయస్సు ఉన్న అమ్మాయి లాగా కనిపిస్తుందని కామెంట్స్ చేశారు. కానీ ఇప్పుడు ఆమె ఈ సినిమాలో నటించడం లేదు అనే వార్త తెలియడంతో అభిమానులు రిలాక్స్ అయ్యారు. లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏమిటంటే ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్(Jhanvi Kapoor) నటించబోతుంది తెలుస్తుంది. త్వరలోనే మూవీ టీం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతుంది.