Homeఎంటర్టైన్మెంట్Allu Arjun Son Allu Ayaan: జూనియర్ పుష్ప.. అల్లు అయాన్ తండ్రిని ఇమిటేట్ చేస్తే...

Allu Arjun Son Allu Ayaan: జూనియర్ పుష్ప.. అల్లు అయాన్ తండ్రిని ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా?

Allu Arjun Son Allu Ayaan: అల్లు అర్జున్(Allu Arjun) కి పుష్ప(Pushpa) చిత్రం ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది. అంతర్జాతీయంగా కూడా అల్లు అర్జున్ పేరు వినిపిస్తోంది. ఇటీవల జరిగిన బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి అల్లు అర్జున్ వెళ్ళాడు. ఆయనకు ప్రత్యేక ఆహ్వానం దక్కింది. మేడం టుస్సాడ్స్ దుబాయ్ మ్యూజియం లో అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ ఘనత అందుకున్న అరుదైన హీరోల్లో అల్లు అర్జున్ ఒకరిగా నిలిచాడు. వీటన్నింటికీ మించి నార్త్ ఇండియాలో అల్లు అర్జున్ క్రేజ్ విపరీతంగా పెరిగింది.

పుష్ప సక్సెస్ నేపథ్యంలో పుష్ప 2 కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ పుష్ప లో డీ గ్లామర్ రోల్ చేశాడు. తండ్రి పేరు చెప్పుకోలేక సమాజంలో అవమానాల పాలైన కొడుకుగా అల్లు అర్జున్ కనిపిస్తాడు. ఆ ఆక్రోశం నుండి పుట్టిన తెగింపు అతన్ని స్మగ్లర్ చేస్తుంది. ఏం చేసైనా ఉన్నతంగా బ్రతకాలి అనే మొండితనంతో ముందుకు వెళతాడు.

పుష్ప పాత్ర మేనరిజం ని దర్శకుడు సుకుమార్ ప్రత్యేకంగా రూపొందించారు. ఒక భుజం పైకి లేపి గూనిగా అల్లు అర్జున్ నడుస్తాడు. ఈ మేనరిజం కూడా జనాల్లోకి వెళ్ళింది. కాగా అల్లు అర్జున్ పుష్ప మేనరిజం ని ఆయన కొడుకు అయాన్ ఇమిటేట్ చేశాడు. పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ మాదిరి నడిచాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ ని చాలా బాగా అనుకరించారు అల్లు అయాన్. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. జూనియర్ పుష్ప అంటూ కితాబు ఇస్తున్నారు.

ఈ వీడియో వైరల్ గా మారింది. అల్లు అర్జున్ – స్నేహారెడ్డి దంపతులకు ఇద్దరు సంతానం. అబ్బాయి అయాన్ కాగా, అమ్మాయి పేరు అర్హ. ఇద్దరూ చిచ్చర పిడుగులే. అల్లు అర్జున్ ఇంట్లో ఖాళీగా ఉంటే పిల్లలతో ఆడుకుంటాడు. వాళ్లతో సరదాగా గడుపుతాడు. అల్లు అర్హ ఆల్రెడీ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. సమంత హీరోయిన్ గా గత ఏడాది విడుదలైన పౌరాణిక చిత్రం శాకుంతలంలో భరతుడు పాత్ర చేసింది అర్హ.

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonliine_)

RELATED ARTICLES

Most Popular