Allu Arjun: మెగా మరియు అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ రోజురోజుకి గ్యాప్ పెరిగిపోతూ ఉంది అనడానికి ఇటీవల కాలం లో ఎన్నో ఉదాహరణలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పకపోయినా పర్వాలేదు. కానీ కష్ట సమయంలో కూడా పట్టించుకోవడం లేదంటే వాళ్ళ మధ్య కనీసం మాటలు లేని రేంజ్ లో గ్యాప్ పెరిగిపోయిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రీసెంట్ గా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్(Mark Shankar) సింగపూర్ లోని సమ్మర్ క్యాంప్ స్కూల్ కి వెళ్ళినప్పుడు జరిగిన అగ్ని ప్రమాదంలో గాయాలపాలైన సంగతి మన అందరికీ తెలిసిందే. 8 ఏళ్ళు కూడా నిండని ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) స్థాయి నాయకుల నుండి, క్రింది స్థాయి నాయకుల వరకు ప్రతీ ఒక్కరూ కోరుకున్నారు. పవన్ కళ్యాణ్ పేరు కూడా ఎత్తడానికి ఇష్టపడని వై ఎస్ జగన్(YS Jagan) లాంటోళ్ళు కూడా స్పందించి మార్క్ శంకర్ కోలుకోవాలి అంటూ చెప్పుకొచ్చారు.
Also Read: ‘హరి హర వీరమల్లు’ సరికొత్త పోస్టర్ విడుదల..రూమర్స్ కి చెక్ పెట్టిన టీం!
సినీ నటులలో జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) ట్విట్టర్ ద్వారా స్పందించి మార్క్ శంకర్ కోలుకోవాలి అంటూ ట్వీట్స్ వేశారు. ఇలా ఇంత మంది స్పందించినప్పుడు, అల్లు అర్జున్(Icon star Allu Arjun) ఎందుకు స్పందించలేదు?, తాను అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ స్పందించలేదు, తనని చూసేందుకు ఇంటికి రాలేదు అనే కోపాన్ని మనసులో పెట్టుకున్నాడా?, లేకపోతే వేరే ఏదైనా కారణం ఉందా అని అభిమానులు సోషల్ మీడియా లో చర్చించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అరెస్ట్ సమయంలో అల్లు అర్జున్ ని కలవకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని, తోటి సినీ నటుడు అయ్యుంటే కచ్చితంగా కలిసి ఉండేవాడని, కానీ ఆయన ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్న వ్యక్తి కేవలం ఒక్కరి వైపు పూర్తిగా నిలబడలేడు కదా, అయినా ఆయన తర్వాత చిరంజీవి, నాగబాబు వంటి వారు వెళ్లారు కదా అని మెగా అభిమానుల నుండి వినిపిస్తున్న వాదన.ఎన్ని వాదనలు వినిపించినా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కి దూరం గా ఉంటున్నాడు అనే విషయం వాస్తవమని విశ్లేషకులు అంటున్న మాట.
ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒకప్పుడు కనీసం అల్లు అరవింద్(Allu Aravind) స్పందించి, అన్ని తానై నడిపించేవాడు. కానీ ఇప్పుడు ఆయన కూడా మౌనం పాటించాడు. మెగా ఫ్యామిలీ నుండి రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వంటి వారు కూడా స్పందించలేదు కదా, కేవలం అల్లు ఫ్యామిలీ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని మీరంతా అనుకోవచ్చు. కానీ మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి, సురేఖలు సింగపూర్ కి వెళ్లి మరీ మార్క్ శంకర్ ని చూసారు. వాళ్ళు అంత శ్రద్ద చూపించినప్పుడు కచ్చితంగా మెగా ఫ్యామిలీ మొత్తం అదే స్థాయిలో స్పందించి ఉండొచ్చు. కానీ అల్లు ఫ్యామిలీ కూడా స్పందించింది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కనీసం అల్లు అరవింద్ గారు చిరంజీవి, సురేఖలతో కలిసి సింగపూర్ కి వెళ్లి ఉన్నా, ఇన్ని అనుమానాలు వచ్చి ఉండేవి కాదని అంటున్నారు మెగా ఫ్యాన్స్. ఏది ఏమైనా మెగా, అల్లు కుటుంబాల మధ్య భారీ గ్యాప్ పెరిగినట్టు అభిమానులకు సిగ్నల్స్ వెళ్లాయి. దీనికి వాళ్ళు భవిష్యత్తులో ఎలాంటి సమాధానం చెప్తారో చూడాలి.