Homeఎంటర్టైన్మెంట్Raaka movie latest updates: 'రాకా' కోసం అల్లు అర్జున్ సంచలన నిర్ణయం.. ఎవరైనా దీనికి...

Raaka movie latest updates: ‘రాకా’ కోసం అల్లు అర్జున్ సంచలన నిర్ణయం.. ఎవరైనా దీనికి సెల్యూట్ చెయ్యాల్సిందే..

Raaka movie latest updates: ‘పుష్ప’ సిరీస్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న ‘రాకా’ చిత్రం పై ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రేజ్ మామూలుది కాదు. అల్లు అర్జున్ తన ప్రతీ సినిమాతో కొత్తదనాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చెయ్యాలనే తపనతో , కసితో ఉంటాడు. అందులో భాగంగానే ఆయన ఈ చిత్రాన్ని ఒప్పుకున్నాడు అనేది మనకి ఫస్ట్ లుక్ చూసినప్పుడే అర్థం అయ్యింది. ఈ ఫస్ట్ లుక్ లో ఆయన మానవ మృగం లాగా కనిపించడం గమనార్హం. ఆ క్యారెక్టర్ సరిగ్గా వర్కౌట్ అయితే ఇండియన్ బాక్స్ ఆఫీస్ మరోసారి షేక్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదంతా పక్కన పెడితే మన టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రస్తుతం గడ్డు కాలం లో ఉంది. సినిమాలకు సంబంధించిన బడ్జెట్ లు హద్దులు దాటుతున్నాయి. మరోపక్క కరోనా లాక్ డౌన్ తర్వాత పుట్టిన ఓటీటీ బిజినెస్ ఇప్పుడు బాగా పడిపోయింది.

ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమా అయినా సరే , ఒకప్పుడు ఇచ్చిన ఆఫర్స్ ని ఇప్పుడు ఇవ్వడం లేదు ఓటీటీ సంస్థలు , దాదాపుగా 50 శాతానికి పైగా తగ్గించేశాయి . ఇలాంటి సమయం లో హీరోలు గొప్ప మనసు చేసుకొని రెమ్యూనరేషన్స్ తగ్గించుకోవడమో , లేకపోతే తమ ఖర్చులు తగ్గించుకోవడమో చేస్తుంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ‘రాకా’ చిత్రం కోసం అదే చేస్తున్నాడు. ఈ సినిమాకు ఆయన రెమ్యూనరేషన్ తగ్గించుకుంటాడో లేదో తెలియదు కానీ , నిర్మాతకు భారం తగ్గించే ప్రయత్నాలు మాత్రం చాలా గట్టిగా చేస్తున్నాడు. తనకు నిర్మాత కల్పించిన ప్రైవేట్ జెట్ సదుపాయాన్ని అల్లు అర్జున్ తిరస్కరించాడు. సాధారణ ఫ్లైట్ లో ఎకానమీ క్లాస్ లోనే ఆయన ఇకపై ప్రయాణం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. రీసెంట్ గానే ముంబై కి ‘రాకా’ షూటింగ్ కోసం వెళ్లిన అల్లు అర్జున్ , ప్రైవేట్ జెట్ లో కాకుండా సాధారణ ఫ్లైట్ లోనే ప్రయాణం చేసాడు.

ఈ సంస్కృతి కి తెరలేపిన మొట్టమొదటి హీరో కమల్ హాసన్. రీసెంట్ గానే ఆయన హైదరాబాద్ లో ‘కల్కి 2’ షూటింగ్ లో పాల్గొన్నాడు. ఈ షూటింగ్ కోసం నిర్మాత అశ్వినీదత్ ప్రైవేట్ జెట్ బుక్ చేస్తానంటే నిరాకరించిన కమల్ హాసన్ , సాధారణ ఫ్లైట్ లో ఎకానమీ క్లాస్ లోనే ప్రయాణం చేశాడు . కమల్ హాసన్ ని చూసి , ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే మార్గాన్ని అనుసరించడం తో సోషల్ మీడియా లో నెటిజెన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ‘రాకా’ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్ లో సాగుతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పై పలు కీలకమైన యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ కి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
[td_block_15 category_id="_related_tag" custom_title="Related News" ajax_pagination="next_prev" limit="3"]