https://oktelugu.com/

Unstoppable 4 : ‘అన్ స్టాపబుల్ 4’ లో పవన్ కళ్యాణ్, ప్రభాస్ గురించి ప్రశ్నలు..6 అడుగుల బంగారం అంటూ అల్లు అర్జున్ కామెంట్స్!

రేపు స్ట్రీమింగ్ అవ్వబోయే నాల్గవ ఎపిసోడ్ కి ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాబోతున్నాడు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేసిన ఆహా మీడియా టీం, కాసేపటి క్రితమే ట్విట్టర్ లో ఒక షార్ట్ ప్రోమో ని విడుదల చేసారు.

Written By:
  • Vicky
  • , Updated On : November 14, 2024 / 07:50 PM IST

    Unstoppable 4

    Follow us on

    Unstoppable 4 : నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో విజయవంతంగా మూడు సీజన్స్ ని పూర్తి చేసుకొని ఇప్పుడు నాల్గవ సీజన్ లోకి అడుగుపెట్టింది. నిన్న గాక మొన్ననే మొదలైనట్టు అనిపిస్తున్న ఈ సీజన్ అప్పుడే మూడు ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకుంది. మొదటి ఎపిసోడ్ కి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేయగా, రెండవ ఎపిసోడ్ కి దుల్కర్ సల్మాన్, మూడవ ఎపిసోడ్ కి సూర్య ముఖ్య అతిథులుగా విచ్చేసారు. ఇక రేపు స్ట్రీమింగ్ అవ్వబోయే నాల్గవ ఎపిసోడ్ కి ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాబోతున్నాడు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేసిన ఆహా మీడియా టీం, కాసేపటి క్రితమే ట్విట్టర్ లో ఒక షార్ట్ ప్రోమో ని విడుదల చేసారు.

    ఈ షార్ట్ ప్రోమోలో అల్లు అర్జున్ స్క్రీన్ మీద ప్రభాస్ , పవన్ కళ్యాణ్ ఫోటోలను చూపించి, వీళ్ళ గురించి మీ మనసులోని ఒక్క మాట చెప్పండి అని బాలకృష్ణ అడుగుతాడు. ప్రభాస్ గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘అప్పటికీ..ఇప్పటికీ ఒకటే మాట. ప్రభాస్ ఆరు అడుగుల బంగారం’ అని అంటాడు. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా పెట్టారు. ఏమి మాట్లాడాడో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. ఈ సందర్భం కోసం అటు పవన్ కళ్యాణ్ అభిమానులు , ఇటు అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున సంగతి తెలిసిందే. ఎందుకంటే అల్లు అర్జున్ తన స్నేహితుడు, నంద్యాల వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్ప రవికి ఎన్నికల సమయంలో సపోర్ట్ చేయడం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపింది.

    పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ కి మధ్య ఎలాంటి విబేధాలు లేవు. కానీ ఈ ఘటన జరిగిన దగ్గర నుండి నేటి వరకు ఈ ఇరువురి హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియా లో ఫ్యాన్ వార్స్ జరుగుతూనే ఉన్నాయి. ఒకరిని ఒకరు దూషించుకుంటూ, దుర్భాషాలు ఆడుకుంటూ ఉన్నారు. దీనికి ఎండ్ కార్డు పడాలంటే అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ కలవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అంటున్నారు. కానీ నేరుగా కలవకపోయిన ‘అన్ స్టాపబుల్’ షో ద్వారా పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయితే,ఈ ఇద్దరి హీరోల అభిమానుల ఫ్యాన్ వార్స్ ఆగుతాయని ఆశిస్తున్నారు పెద్దలు. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి . వచ్చే నెల 5 వ తారీఖున అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ చిత్రం విడుదల అవ్వబోతుంది. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. 17 వ తారీఖున పాట్నా లో గ్రాండ్ గా ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారు.