Pushpa 2 Pre Release Event: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవిని ఎరుగని రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నప్పటికి అందులో అల్లు అర్జున్ కి చాలా ప్రత్యేకమైన స్థానం ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలన్నీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి ని కూడా క్రియేట్ చేసుకోవడంలో సహాయ పడుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తాచాటడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న ఈ స్టార్ హీరోలు ఫ్యూచర్లో ఒకసారైనా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నారు.
ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ తన శక్తి కి మించి కష్టపడినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు చాలామంది సినిమా మేధావులు సైతం ఈ సినిమా గురించి భారీ అంచనాలైతే పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా పాన్ ఇండియాలో రికార్డులను భారీ రికార్డు లను సృష్టిస్తుందంటూ కామెంట్లను కూడా చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా నిన్న జరిగిన ఈవెంట్ లో దేవిశ్రీప్రసాద్ చాలా అద్భుతంగా మాట్లాడాడు. ఇక ఆయన తర్వాత మాట్లాడిన అల్లు అర్జున్ దేవి శ్రీ ప్రసాద్ గురించి మాట్లాడుతూ దాదాపు ఆర్య సినిమా నుంచి ఇప్పటివరకు 20 సంవత్సరాలుగా తనకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించడం వల్లే ఈ పొజిషన్ లో ఉన్నానంటూ కూడా చెప్పడం విశేషం. ఇక దానికి తగ్గట్టుగానే దేవి శ్రీ ప్రసాద్ కి ఐ లవ్ యు దేవి అంటూ అల్లు అర్జున్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
మొన్నటిదాకా పుష్ప 2 కాంట్రవర్సీ నడిచిన విషయం మనకు తెలిసిందే. ఇక మొత్తానికైతే దేవిశ్రీప్రసాద్ సుకుమార్ అల్లుఅర్జున్ మధ్య ఎలాంటి విభేదాలు లేవు అనేది ఈ ఈవెంట్లో స్పష్టం చేశారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా విషయంలో వీళ్లంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉండడం సినిమా సక్సెస్ ని సాధిస్తుందంటూ ప్రతి ఒక్కరూ ఈ సినిమాకి బెస్ట్ విశేషం చెప్పడంతో ప్రస్తుతం ఈ సినిమా ఒక వండర్ ని క్రియేట్ చేయబోతుందనే విషయం అయితే అందరికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది… మరి ఈ సినిమా టాన్ ఇండియాలో ఉన్న రికార్డులను తిరగరాస్తుందా లేదా అని తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…