Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో కీలకపాత్ర వహిస్తూ వస్తున్నాయి. రీసెంట్ గా ఆయన చేసిన ‘పుష్ప 2’ సినిమాతో భారీ విజయాలను అందుకోవడమే కాకుండా 1850 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడనే చెప్పాలి. ఇక ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలన్నింటిలో ‘పుష్ప 2’ సినిమా భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టిందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇక మీదట రాబోయే సినిమాలతో సైతం ఆయన ఇండస్ట్రీ హిట్లను సాధించి నెంబర్ వన్ హీరోగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన అట్లీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో భారీ గుర్తింపును సంపాదించుకొని పాన్ ఇండియా లెవెల్లో తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. 800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా 2500 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబడుతుందనే కాన్ఫిడెంట్ తో ఇటు దర్శకుడు, అటు హీరో ఇద్దరూ ఉన్నట్టుగా తెలుస్తోంది.
Also Read: హిట్ మూవీ కొత్త పోస్టర్ మామూలుగా లేదుగా…నాని అరాచకం అంతే..?
ఇక హైలి గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమా విషయంలో అల్లు అర్జున్ చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది…ఇక అంతా బానే ఉన్నప్పటికి అల్లు అర్జున్ సినిమా కోసం 800 కోట్ల బడ్జెట్ ని కేటాయించడం ఎందుకు ఒకవేళ ఈ సినిమా తేడా కొడితే మాత్రం ప్రొడ్యూసర్స్ భారీగా నష్టపోతారు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
పుష్ప 2 సినిమాకి 1850 కోట్లు రావడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే పుష్ప మొదటి పార్ట్ హిట్ అయి రెండో పార్టీ మీద భారీ అంచనాలు ఉండడం వల్ల ప్రతి ఒక ప్రేక్షకుడు కూడా ఈ సినిమాని థియేటర్లో చూశారు. ఇక దానికి తోడుగా టికెట్ల ధరలను భారీగా పెంచడం వల్లే ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ అయితే వచ్చాయి. మరి తర్వాత చేయబోయే సినిమా కూడా ఆ రేంజ్ లోనే ఆడుతుంది అనుకోవడం సరైన విషయం కాదు.
ఎందుకంటే ఆ సినిమాకి ఉన్న హైప్ వేరు ఆ సినిమా తీసుకొచ్చిన మార్కెట్ వేరు కాబట్టి అట్లీతో చేయబోతున్న సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుందనుకుంటే అది వాళ్ళ అమాయకత్వమే అవుతుంది. మరి అందుకే ఈ సినిమాతో అల్లు అర్జున్ రిస్క్ చేస్తున్నాడా? ఒక వేళ ఈ సినిమా ప్లాప్ అయితే ప్రొడ్యూసర్స్ పరిస్థితి ఏంటి? అనే ధోరణిలో మరి కొన్ని అభిప్రాయాలు కూడా వెలవడుతున్నాయి…