Allu Arjun: మెగాస్టార్ చిరంజీవి(Megatsar Chiranjeevi) సీనియర్ అభిమానులందరికీ పాత మెగాస్టార్ చిరంజీవి ని మరోసారి వెండితెర పైకి తీసుకొచ్చి, ఎంజాయ్ చేసేలా చేసిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu). ఈ సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ విడుదలై ఈ సినిమా సృష్టిస్తున్న రికార్డులు మామూలు రేంజ్ లో లేవు. 8 రోజుల్లోనే ఈ చిత్రం దాదాపుగా 240 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. పండగ సెలవులు అయిపోయినప్పటికీ కూడా ఈ చిత్రం హౌస్ ఫుల్స్ ని నమోదు చేసుకుంటూ ముందుకెళ్తుందంటే, రాబోయే రోజుల్లో ఈ చిత్రం 300 కోట్ల గ్రాస్ ని మాత్రమే కాదు, 400 కోట్ల గ్రాస్ ని కూడా అవలీలగా అందుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదంతా పక్కన పెడితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ఈ చిత్రాన్ని చూసి ట్విట్టర్ లో వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సంచలనం గా మారింది.
అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి కి ఎంత పెద్ద వీరాభిమాని అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఇంత పెద్ద పాన్ ఇండియన్ సూపర్ స్టార్ అయినప్పటికీ కూడా, కట్టే కాలే వరకు నేను చిరంజీవి గారి వీరాభిమానిని అంటూ ఇప్పటికీ చెప్తూనే ఉంటాడు. అలాంటి వీరాభిమాని అవ్వడం వల్లే, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాన్ని ఒక రేంజ్ లో ఎంజాయ్ చేసాడు అల్లు అర్జున్. గత వారం రోజులుగా జపాన్ టూర్ లో ఉన్న అల్లు అర్జున్, నిన్ననే హైదరాబాద్ కి తిరిగి వచ్చాడు. వచ్చి రాగానే తన కుటుంబం తో కలిసి చిరంజీవి సినిమాకు వెళ్ళాడు. వెళ్లిన తర్వాత తన అనుభవాన్ని ఒక సాధారణ అభిమాని లాగా ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఇంతకీ ఆయన వేసిన ట్వీట్ లో ఏముందో ఒకసారి చూద్దాం.
ఆయన మాట్లాడుతూ ‘మన శంకర వరప్రసాద్ గారు మూవీ టీం మొత్తానికి శుభాకాంక్షలు. ది బాస్ ఈజ్ బ్యాక్. వెండితెర పై వింటేజ్ మెగాస్టార్ చిరంజీవి గారిని చూస్తే చాలా సంతోషం వేసింది. విక్టరీ వెంకటేష్ గారు కూడా అదరగొట్టేసాడు. వెండితెర పై అందమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో నయనతార గారు, కామెడీ టైమింగ్ తో కాథరిన్ థెరిసా ఈ సినిమాకు కొత్త ఎనర్జీ ని అందించారు. మిగిలిన నటీనటులు కూడా సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచారు, ముఖ్యంగా సంక్రాంతి స్టార్ బుల్లిరాజు అదరగొట్టేసాడు. ఇక బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ని అందించిన భీమ్స్ కి శుభాకాంక్షలు. ముఖ్యంగా హుక్ స్టెప్, మెగా విక్టరీ పాటలకు నేను కూడా విజిల్స్ వేసాను. నిర్మాతగా తొలిసినిమాతోనే సూపర్ హిట్ ని అందుకున్న నా కజిన్ సుష్మిత కి, సాహు గారపాటి గారికి శుభాకాంక్షలు. ఇది కేవలం సంక్రాంతి బ్లాక్ బస్టర్ కాదు, సంక్రాంతి బాస్ బస్టర్’ అంటూ చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్.
CONGRATULATIONS TO THE ENTIRE TEAM OF #ManaShankaraVaraPrasadGaru
The BOSS IS BACK ❤️ L – I – T
Happy to see our megastar @KChiruTweets garu light up the screens again Full #VintageVibes
⁰@VenkyMama garu rocked the show . #VenkyGowda ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದಿರಾ (Thumba… pic.twitter.com/SI8CF7r9VO— Allu Arjun (@alluarjun) January 20, 2026
