Pushpa: స్పైడర్​ మ్యాన్​ సినిమాపై పుష్పరాజ్​ ఏమన్నారంటే?

Pushpa: మార్వెల్ కామిక్స్​లో ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది స్పైడర్​ మ్యాన్​. ఇప్పటికే ఈ కామిక్​ మీద ఎన్నో సిరీస్​లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది స్పైడర్​ మ్యాన్​కు అభిమానులయ్యారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ థియేటర్లకు వచ్చి స్పైడర్​ మ్యాన్​ను చూసి ఎంజాయ్​ చేశారు. తాజాగా స్పైడర్​ మ్యాన్​ : నో వే హోమ్​తో మరోసారి అలంచేందుకు సిద్ధమయ్యారు మేకర్స్​. Also Read: పుష్పరాజ్​కు అయాన్​ స్పెషల్​ విషెస్​.. నెట్టింట్లో […]

Written By: Raghava Rao Gara, Updated On : December 17, 2021 3:12 pm
Follow us on

Pushpa: మార్వెల్ కామిక్స్​లో ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది స్పైడర్​ మ్యాన్​. ఇప్పటికే ఈ కామిక్​ మీద ఎన్నో సిరీస్​లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది స్పైడర్​ మ్యాన్​కు అభిమానులయ్యారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ థియేటర్లకు వచ్చి స్పైడర్​ మ్యాన్​ను చూసి ఎంజాయ్​ చేశారు. తాజాగా స్పైడర్​ మ్యాన్​ : నో వే హోమ్​తో మరోసారి అలంచేందుకు సిద్ధమయ్యారు మేకర్స్​.

Pushpa

Also Read: పుష్పరాజ్​కు అయాన్​ స్పెషల్​ విషెస్​.. నెట్టింట్లో పోస్ట్​ వైరల్

తాజాగా విడుదలైన ఈ సినిమా రెట్టింపు జోష్​తో ముందుకు దూసుకెళ్లిపోతోంది. మరోవైపు పుష్ప కూడా రంగంలోకి దిగి తన సత్తా చూపుతోంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద పోటీగా నిలబడుతున్నాయి. అయితే, స్పైడర్​మ్యాన్​ సినిమా తనకు పోటీగా రావడంపై అల్లు అర్జున్ స్పందించారు. స్పైడర్‌ మ్యాన్ : నో వే హోమ్ విడుదలవ్వడం చాలా సంతోషం. ఇక్కడ స్పైడర్​మ్యాన్​కు చాలా క్రేజ్​ ఉంది. పుష్ప బాక్సాఫీసు వద్ద ఎంత వసూళ్లు సాధిస్తూందోననే ఆలోచన అసలు లేదు. కానీ, స్పైడర్​మ్యాన్​ కచ్చితంగా హిట్​ కొడుతుంది. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి బయటపడుతున్నాం. ప్రేక్షకులు కూడా ధైర్యంగా థియేటర్లకు వస్తున్నారు. అని చెప్పుకొచ్చారు బన్నీ.

కాగా, కరోనా ఎఫెక్ట్​తో చాలా కాలంగా థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. మళ్లీ జనాలు వస్తారా రారా అన్న సందేహంలో ఉండగా.. అఖండ ఘన విజయంతో ఇండస్ట్రీకి కాస్త ఊరట లభించింది. ఈ క్రమంలోనే పెద్ద సినిమాలన్నీ విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు పుష్ప సినిమాకు సంబంధించి థియేట్రికల్, ఓటిటి, శాటిలైట్, ఆడియో హక్కులతో సహా ఓవరాల్​గా అన్ని రైట్స్ కలిసి  రూ. 250 కోట్లు పలికినట్లు తెలుస్తోంది.

Also Read: ‘పుష్ప- ది రైజ్’ రివ్యూ