https://oktelugu.com/

Pushpa 2 song : పుష్ప 2 సాంగ్ మీద స్పందించిన వార్నర్… ఏం పర్లేదు నేను ఉన్నాను అంటున్న అల్లు అర్జున్…

ఇక వార్నర్ ఆస్ట్రేలియన్ ప్లేయర్ గా కాకుండా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కి ప్లేయర్ గా వ్యవహరించడంతో ఆయన మీద తెలుగు ప్రేక్షకులందరికీ చాలా మంచి ఒపినియన్ అయితే ఉంది.

Written By:
  • NARESH
  • , Updated On : May 2, 2024 / 08:28 PM IST

    Allu Arjun reacts to David Warner's comment on Pushpa 2 song

    Follow us on

    Pushpa 2 song : పాన్ ఇండియాలో ఐకాన్ స్టార్ గా తన కంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్…అయితే పుష్ప సినిమాతో ఈయన ఒక్కసారిగా భారీ సక్సెస్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాతో మరోసారి సూపర్ సక్సెస్ ను సాధించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా పుష్ప 2 సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా “పుష్ప పుష్ప పుష్ప” అంటూ సాగే సాంగ్ ని రిలీజ్ చేశారు.

    అయితే ఈ సాంగ్ లో అల్లు అర్జున్ వేసిన కొన్ని స్టెప్పులను కూడా రివిల్ అయితే చేశారు. ఇక అందులో ఆయన వేస్తున్న ఒక హుక్ స్టెప్ ని రివిల్ చేసి అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా మంచి కిక్కిచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఇక దీంతో ఈ సినిమా మీద పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలైతే పెరిగాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఈ సాంగ్ గురించి కూడా ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు.

    ఇక అందులో భాగంగానే ఆస్ట్రేలియన్ క్రికెట్ ప్లేయర్ అయిన డేవిడ్ వార్నర్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ “అల్లు అర్జున్ గారు పుష్ప సాంగ్ లో మీరు వేసిన స్టెప్పు చాలా బాగుంది. కాకపోతే నాకు ఇప్పుడు కొంచెం పనుంది అని తను ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడు”. ఇక దానికి అల్లు అర్జున్ స్పందిస్తూ “అది చాలా ఈజీ మనం కలిసినప్పుడు నేను మీకు చెబుతాను” అంటూ ఆయన రీప్లే ఇచ్చాడు. ఇక దాంతో డేవిడ్ వార్నర్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు…

    ఇక వార్నర్ ఆస్ట్రేలియన్ ప్లేయర్ గా కాకుండా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కి ప్లేయర్ గా వ్యవహరించడంతో ఆయన మీద తెలుగు ప్రేక్షకులందరికీ చాలా మంచి ఒపినియన్ అయితే ఉంది. ఇక దానికి తగ్గట్టుగానే ఆయన రీల్స్ చేస్తూ ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యే ప్రయత్నం అయితే చేశాడు. ఇక ఇప్పుడు దీంతో మరోసారి వార్నర్ వార్తల్లో నిలిచాడు…