Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 మూవీతో నయా బెంచ్ మార్క్ సెట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సినిమా పై ఉన్న హైప్, వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. 1000 కోట్ల వసూళ్లు కేక్ వాక్ అనిపిస్తున్నాయి. పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్స్ రూ. 100 కోట్లు దాటేశాయి. మరో రెండు రోజుల సమయం ఉంది. ఓపెనింగ్ డే పుష్ప 2 వరల్డ్ రూ. 250 నుండి 275 కోట్ల గ్రాస్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు. ఇండియాతో పాటు ఓవర్సీలో పుష్ప 2 టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.
వన్ మిలియన్ టికెట్స్ ఆల్రెడీ అమ్ముడుపోయాయి. పుష్ప 2 రికార్డ్స్ కి ఆకాశమే హద్దు అనిపిస్తుంది. కాగా అల్లు అర్జున్ మరో అరుదైన గౌరవం అందుకున్నాడు. ఫార్చ్యూన్ ఇండియా దేశంలో అత్యధిక ఇన్కమ్ టాక్స్ కట్టిన స్టార్ హీరోల లిస్ట్ విడుదల చేసింది. టాప్ 20లో అల్లు అర్జున్ కి మాత్రమే చోటు దక్కింది. ప్రభాస్, మహేష్ బాబు వంటి అత్యధిక ఆదాయం కలిగిన హీరోలకు కూడా టాప్ ట్వంటీలో చోటు దక్కలేదు.
ఈ లిస్ట్ పరిశీలిస్తే.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను అల్లు అర్జున్ రూ. 14 కోట్ల ఇన్కమ్ టాక్స్ చెల్లించాడట. ఆయనకు 16వ స్థానం దక్కింది. ఇక అత్యధిక ట్యాక్స్ చెల్లిస్తున్న హీరోగా మొదటి స్థానంలో హీరో షారుఖ్ ఖాన్ ఉన్నారు. సినిమాలు, బ్రాండ్స్ తో పాటు వ్యాపారాల ద్వారా షారూఖ్ పెద్ద మొత్తంలో ఆర్జిస్తున్నారు. షారూఖ్ ఖాన్ రూ. 92 కోట్లు చెల్లించాడట. అనూహ్యంగా సౌత్ ఇండియా స్టార్ విజయ్ రెండో స్థానంలో ఉన్నారట. ఆయన రూ. 80 కోట్లు చెల్లించినట్లు సమాచారం.
సల్మాన్ ఖాన్ రూ. 75 కోట్లు, అమితాబ్ రూ. 71 కోట్లు, అజయ్ దేవ్ గణ్ రూ. 42 కోట్లు చెల్లించి.. టాప్ 5 లో ఉన్నారట. వీరి తర్వాత స్థానాల్లో రన్బీర్ కపూర్, హృతిక్ రోషన్ ఉన్నారట. కరీనా కపూర్, కియారా అద్వానీ, కత్రినా కైఫ్ లకు కూడా టాప్ 20 చోటు దక్కడం విశేషం. వీరు కూడా ఆదాయ పన్ను కోట్లలో చెల్లిస్తున్నారు.