Allu Arjun OTT Movie: పాన్ ఇండియా హీరోగా ఎదగాలన్న అల్లు అర్జున్ ఆశలు నెరవేరినట్లే కనిపిస్తుంది. పుష్ప తెలుగుతో పాటు మిగతా భాషల్లో కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా హిందీలో పుష్ప ఊహకు మించిన వసూళ్లు రాబడుతుంది. ఓపెనింగ్ డే మూడు కోట్ల వసూళ్లు సాధించిన పుష్ప హిందీ వర్షన్… రెండు వారాల తర్వాత కూడా అదే రేంజ్ కలెక్షన్స్ రాబట్టింది. పుష్ప కలెక్షన్స్ స్థిరంగా కొనసాగాయి. ప్రతి వీకెండ్స్ లో కలెక్షన్స్ పుంజుకోవడం జరిగింది. ఒక సినిమాకు ఇలా స్థిరంగా సాలిడ్ వసూళ్లు రావాలంటే హీరోకి స్టార్డం ఉండాలి లేదా సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చేయాలి.
తెలుగులో కంటే కూడా హిందీలోనే పుష్ప అతిపెద్ద విజయం సాధించింది. ఇప్పటికి కూడా తెలుగు రాష్ట్రాల్లో పుష్ప బ్రేక్ ఈవెన్ కి చేరుకోలేదు. ఆంధ్రప్రదేశ్ లో చేరుకునే పరిస్థితి కూడా లేదు. నైజాంలో మాత్రం జస్ట్ బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసింది. పుష్ప తో నష్టపోయిన ఆంధ్రా బయ్యర్లకు నిర్మాతలు కొంత మేర తిరిగి చెల్లించినట్లు సమాచారం.
అయితే అల్లు అర్జున్ కోరిక మాత్రం తీరింది. నార్త్ ప్రేక్షకులు తనని ఆదరిస్తారన్న ఆయన నమ్మకం నిజమైంది. పుష్ప హిందీ వర్ష క్లీన్ హిట్ గా నిలిచింది. అయితే బాలీవుడ్ పెద్దలు ఎప్పటిలాగే దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బాహుబలి విజయం తర్వాత భారత చలన చిత్ర పరిశ్రమపై టాలీవుడ్ ఆధిపత్యం మొదలైంది. ఆ తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన సాహో చిత్రంపై హిందీ పరిశ్రమ విషం కక్కింది. సాహో చిత్రానికి ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్స్ దారుణమైన రేటింగ్స్ ఇచ్చారు. నెగిటివ్ పబ్లిసిటీతో మూవీ ఫలితాన్ని దెబ్బతీయలేరని సాహో నిరూపించింది.
తెలుగులో నష్టాలు మిగిల్చిన సాహో.. హిందీలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రూ . 150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో దుమ్మురేపింది. ప్రస్తుతం పుష్ప హిందీ బెల్ట్ లో ఇరగదీస్తున్నా… బాలీవుడ్ ప్రముఖులు మాత్రం నోరు మెదపడం లేదు. నేషనల్ వైడ్ గా మార్కెట్ ఉన్న హిందీ సినిమాలు ముక్కీమూలిగి వంద కోట్ల వసూళ్లు తెచ్చుకోవడమే గగనంగా ఉంటే… తెలుగు చిత్రాలు యావరేజ్ టాక్ తో కూడా వందల కోట్ల వసూళ్లు అందుకుంటున్నాయి.
Also Read: ‘పుష్ప’ పై మంచు లక్ష్మి కామెంట్స్.. రియాక్ట్ అయిన బన్నీ !
పుష్ప విడుదలై మూడు వారాలు దాటిపోగా.. జనవరి 7నుండి అమెజాన్ ప్రైమ్ లోకి అందుబాటులోకి వచ్చింది. ఓటిటిలోకి అందుబాటులోకి వచ్చిన తర్వాత బాలీవుడ్ ప్రముఖులు ఈ సినిమా చూస్తున్నారు. దీంతో పుష్ప మూవీని, హీరో అల్లు అర్జున్ ని పొగుడుతూ ట్వీట్స్ వేస్తున్నారు. కరణ్ జోహార్, అర్జున్ కపూర్ లాంటి వారు పుష్ప మూవీ గురించి పాజిటివ్ గా స్పందించారు. అక్కడ మన సినిమాలు ఎంత ప్రభంజనం సృష్టిస్తున్నా బాలీవుడ్ స్టార్స్ చూడాలి, వాటి గురించి మాట్లాడాలి అనుకోరు. దానికి వాళ్ళ ఇగో అడ్డు వస్తుంది.
సల్మాన్, షారుక్, అమీర్ అసలు పట్టీపట్టనట్లు ఉంటారు. కరణ్ జోహార్ లాంటి వాళ్లు ఏదో మొక్కుబడిగా మూవీ చూసి ఒక ట్వీట్ చేస్తారు. ఇదంతా ఓర్చుకోలేని తనమే అని చెప్పాలి. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే చిన్న చూపు కలిగిన బాలీవుడ్ హీరోలు… తెలుగు సినిమాలు అక్కడ రికార్డ్స్ తిరగరాయడం జీర్ణించుకోలేకపోతున్నారు.
Also Read: సూపర్ స్టార్ మహేష్ బాబుకి “థాంక్ యూ” చెప్పిన ఐకాన్ స్టార్… ఎందుకంటే ?