Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమా మరికొద్ది రోజుల్లో విడుదల కాబోతుంది. దీంతో చిత్రబృందం ప్రమోషనల్ కార్యక్రమాల జోరు పెంచింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్, పోస్టర్లకు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. తొలిసారి ఈ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు అల్లు అర్జున్. ఇప్పటివరకు అల్లు అర్జున్ కెరీర్ లో తెరకెక్కిన సినిమాల్లో ఇదే భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. నేషనల్ క్రష్ “రష్మిక మందన్నా” హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నాడు. అలానే కన్నడ నటుడు ధనుంజయ, సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఈ తరుణంలో నిన్న విడుదలైన ఈ మూవీ లోని ఐటెం సాంగ్ సైతం యూట్యూబ్ లో భారీ వ్యూస్ ను సంపాదిస్తోంది. కాగా ఇప్పుడు ఈ సినిమాపై ఉన్న క్రేజ్ కి తగ్గట్లే బిజినెస్ కూడా జరుగుతుంది అని సమాచారం. ఇప్పటివరకు ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ అన్నీ కలిపి రూ.250 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అన్ని భాషల్లో థియేట్రికల్ రైట్స్ కి భారీ రేటు పలికిందట. అలానే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం ఎక్కువ మొత్తంలో డీల్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా ఆడియో, శాటిలైట్ రైట్స్ ఎలానూ ఉంటాయి. మొత్తంగా సినిమా బిజినెస్ రూ.250 కోట్లు దాటేసింది అంటున్నారు. అల వైకుంఠపురములోలాంటి ఇండస్ట్రీ హిట్ తరువాత బన్నీ నటిస్తోన్న సినిమా కావడంతో ఈ రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి.