https://oktelugu.com/

Allu Arjun: మెగాస్టార్ పొజిషన్ మీద కన్నేసిన అల్లు అర్జున్…మెగా ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే..?

సినిమా ఇండస్ట్రీ లో ఏ రోజు ఎవరు ఏ పొజిషన్ లో ఉంటారో చెప్పడం చాలా కష్టం. అందరు ఇక్కడ స్టార్ హీరోగా ఎదగడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతుంటారు. అందులో కొందరు సక్సెస్ అయితే, మరికొందరు మాత్రం ఫెయిల్యూర్స్ ను అందుకొని చివరకు ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : August 26, 2024 / 10:39 AM IST

    Allu Arjun(2)

    Follow us on

    Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో గుర్తింపును సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్… ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికైతే ‘పుష్ప 2’ సినిమా సెట్స్ మీద ఉన్నప్పటికీ తన నెక్స్ట్ సినిమాని కూడా చేసే ప్రణాళికలను సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీకి మధ్య వైరం అనేది రోజురోజుకి పెరుగుతుందనే విషయం మనకు తెలిసిందే. రీసెంట్ గా అల్లు అర్జున్ ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగా ఫ్యామిలీకి తనకి సంబంధం లేదు. తను సోలోగా ఇండస్ట్రీకి వచ్చాను అన్నట్టుగా మాట్లాడాడు. ఇక ఈ విషయం మీద మెగా అభిమానులు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి తర్వాత పొజిషన్ ని తనే దక్కించుకోవాలనే ఉద్దేశ్యం తో వాళ్ల నుంచి పక్కకు జరిగాడని మెగాస్టార్, పవర్ స్టార్ లను బీట్ చేయడమే తన ఎజెండా అంటూ సోషల్ మీడియాలో కొన్ని కథనాలు అయితే వెలుపడుతున్నాయి. నిజానికి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని బీట్ చేసే క్రేజ్ అల్లు అర్జున్ కి ఉందా అంటే మెగా అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు కూడా అల్లు అర్జున్ కి అంత సీన్ అయితే లేదు.

    ‘నేషనల్ అవార్డు’ వచ్చినంత మాత్రాన తను గొప్ప హీరో అయితే కాదు. అంతకంటే అద్భుతమైన నటనను ప్రదర్శించిన హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.
    అయినప్పటికీ తనకు అవార్డు వచ్చింది అందుకు సంతోషం. కానీ ఒక్క అవార్డు వచ్చినందుకే అంతలా వీర్రవీగి పోవాల్సిన అవసరమైతే లేదంటూ చాలామంది ప్రేక్షకులు వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేయడం విశేషం…

    ఇక ఇదిలా ఉంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ లు మాత్రం అల్లు అర్జున్ ను అసలు పట్టించుకోవడం లేదు. వాళ్ళ పనిలో వాళ్ళు చాలా బిజీగా కొనసాగుతున్నారు.
    అలాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తూ పేద ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.

    ఇక అల్లు అర్జున్ మాత్రం చిరంజీవి, పవన్ కళ్యాణ్ ను బీట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఆయన కల నెరవేరుతుందా? లేదంటే కలగానే మిగిలిపోతుందా? అనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తానికైతే మెగా – అల్లు ఫ్యామిలీల మధ్య ఇప్పుడు ఒక మినీ యుద్ధం జరుగుతుందనే చెప్పాలి… మరి మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా వెళుతున్న అల్లు అర్జున్ భారీ అంచనాలు పెట్టుకొని చేస్తున్న ‘పుష్ప 2’ సినిమా మీద ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది…