Allu arjun: స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రానున్న చిత్రం పుష్ప. యాక్షన్ డ్రామా నేపథ్యంలో రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలె ఈ సినిమా నుంచి విడుదలైన దాక్కో మేకా పాట ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఆ జోరు కొనసాగుతుండగానే శ్రీవల్లి పాటను విడుదల చేసి మరింత ఊపందించింది. ఈ సినిమా మొదటి భాగాన్ని డిసెంబరు 17న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.
అయితే, బన్నీ నెక్స్ సినిమా గురించి ఓ వార్త సినీ పరిశ్రమలో వినిపిస్తోంది. బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా రానున్నట్లు సమాచారం. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సరైనోడు చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మరో విజయాన్ని సొంతం చేసుకునేందుకు బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఊర మాస్ లుక్‌లో కనిపించనున్నట్లు సినీ వర్గాల్లో టాక్. త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.
మాస్ సినిమాలు తెరకెక్కించడంలో బోయపాటికి సాటెవరూ లేరు. భద్ర, సింహా, లెజెండ్, సరైనోడు వంటి వరుస విజయాతో దూసుకుపోతున్న బోయపాటి.. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా అఖండ సినిమాను చేస్తున్నారు. మరోవైపు పుష్ప సినిమాతో బిజీ షెడ్యూల్‌తో ఉన్నారు బన్నీ. ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత బన్నీ-సుకుమార్ కాంబినేషన్‌లో రానున్న హ్యాట్రిక్ సినిమా పుష్ప. ఇందులో ఎర్రచందనం స్మగ్లర్‌గా ఊరమాస్ లుక్‌లో కనిపించనున్నారు బన్నీ. ఇందులో రష్మిక హీరోయిన్. శ్రీవల్లి పాత్రలో పుష్పరాజ్ ప్రేయసిగా సందడి చేయనుంది. మైత్రిమూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది.