Allu Arjun: అల్లు అర్జున్ ని జీవితాంతం ఈ బాధ వీడదు… గోల్డెన్ ఛాన్స్ మిస్!

అల్లు అర్జున్ ఒక గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. అందుకు సుకుమార్ కారణం అయ్యాడు. పుష్ప 2 అనుకున్న సమయానికి విడుదల చేస్తే బాక్సాఫీస్ షేక్ అయ్యేది. లాంగ్ వీకెండ్ తో పాటు పండగల సెలవులు పుష్ప 2 టీమ్ కోల్పోయారు. ఆగస్టు 15న విడుదలైతే ఎంత ప్లస్ అయ్యేదో చూద్దాం..

Written By: S Reddy, Updated On : July 30, 2024 2:54 pm

Allu Arjun

Follow us on

Allu Arjun: 2021లో విడుదలైన పుష్ప సంచలన విజయం నమోదు చేసింది. ఇది అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. మూవీ ప్రకటన సమయంలో రెండు భాగాలుగా విడుదల చేయాలనే ఆలోచన లేదు. దర్శకుడు రాజమౌళి సూచన మేరకు పార్ట్ 2 ప్రకటన చేశాడట సుకుమార్. అలాగే పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలన్న ప్లాన్ కూడా మధ్యలో వచ్చిందే. నార్త్ ఇండియాలో పెద్దగా ప్రమోట్ చేయలేదు. దాంతో పుష్ప హిందీ వెర్షన్ ఓపెనింగ్ డే రూ. 3 కోట్లు అందుకుంది . దాంతో డిజాస్టర్ కావడం ఖాయమని అందరు అంచనా వేశారు.

పుష్ప మెల్లగా పుంజుకుంది. పుష్ప వసూళ్లు పెరుగుతూ పోయాయి. పుష్ప హిందీ రన్ ముగిసే నాటికి వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. వరల్డ్ వైడ్ అన్ని భాషల్లో పుష్ప 2 రూ. 350 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. పుష్ప సక్సెస్ అల్లు అర్జున్ ఇమేజ్ పూర్తిగా మార్చేసింది. ముఖ్యంగా ఆయన నార్త్ ఇండియాలో జెండా పాతాడు. హిందీ ప్రేక్షకుల్లో అల్లు అర్జున్ పట్ల ఆసక్తి పెరిగింది.

ఈ క్రమంలో పుష్ప 2 ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పుష్ప 2 బడ్జెట్ దాదాపు రూ. 300 కోట్లు. పార్ట్ 1 విడుదలై మూడేళ్లు కావస్తుంది. స్క్రిప్ట్ పూర్తి చేయడానికే సుకుమార్ చాలా కాలం తీసుకున్నాడు. ఓ రెండేళ్లుగా షూటింగ్ జరుగుతుంది. 2024 ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది గోల్డెన్ డేట్. ఆగస్టు 15 గురువారం కావడంతో లాంగ్ వీకెండ్ లభిస్తుంది. మధ్యలో ఉన్న శుక్రవారం లీవ్ తీసుకుంటే నాలుగు రోజులు సెలవులు వస్తాయని ఉద్యోగులు భావిస్తారు.

అంటే 15 నుండి 18 వరకు లాంగ్ వీకండ్ పుష్ప 2కి దక్కుతుంది. సోమవారం అనగా ఆగస్టు 19న రక్షా బంధన్ ఉంది. అంటే ఐదు రోజులు వరుసగా సెలవులు. పుష్ప 2కి ఉన్న డిమాండ్ రీత్యా ఈ సెలవు దినాల్లో వసూళ్లు కుమ్మేసేది. ఆగస్టు 24న జన్మాష్టమి పండగ ఉంది. టాక్ తో సంబంధం లేకుండా పుష్ప 2ని ప్రేక్షకులు ఆదరించే అవకాశం దక్కేది. స్వాతంత్ర్య దినం నాడు పుష్ప విడుదల అయితే ఓపెనింగ్స్ భారీగా ఉండేవి.

లైఫ్ లో అల్లు అర్జున్ తన సినిమాకు ఇంత మంచి రిలీజ్ డేట్ పట్టలేడు. కేవలం సుకుమార్ వలన పుష్ప 2 ఆగస్టు 15న రాలేకపోయింది. అల్లు అర్జున్ కి సుకుమార్ మీద కోపం రావడానికి ఇది కూడా ఒక కారణం. అసలు సుకుమార్ వద్ద ఇప్పటికీ బౌండెడ్ స్క్రిప్ట్ లేదని సమాచారం. డిసెంబర్ 6కి అయినా పుష్ప 2 థియేటర్స్ లోకి వస్తుందనే గ్యారంటీ లేదట.

అంతకంతకు షూటింగ్ ఆలస్యం చేస్తున్న సుకుమార్ మీద కోపంతోనే షార్ట్ బ్రేక్ ఇచ్చి అల్లు అర్జున్ వెకేషన్ కి వెళ్లాడని సమాచారం. అయితే రామోజీ ఫిల్మ్ సిటీలో లేటెస్ట్ షెడ్యూల్ జరుగుతుందట. అల్లు అర్జున్ ఆగస్టు లో జాయిన్ అవుతారట . ఈ షెడ్యూల్ నందు కీలకమైన పతాక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని సమాచారం.