Allu Arjun: ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) బాలీవుడ్ లో మంచి మార్కెట్ ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం నార్త్ ఇండియా లో అల్లు అర్జున్ మార్కెట్ ఖాన్స్ కి ఏ మాత్రం తీసిపోడు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకంటే ఎక్కువ కూడా. ఇక ఎన్నో ఏళ్ళ నుండి కేరళలో కూడా అల్లు అర్జున్ కి అక్కడి స్టార్ హీరోలతో సమానమైన మార్కెట్ ఉంది. తెలుగు మార్కెట్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు అల్లు అర్జున్ కన్ను మొత్తం తమిళనాడు పై పడినట్టుగా అనిపిస్తోంది. తమిళ నాడు లో పెద్ద సూపర్ స్టార్ అయ్యేందుకు అల్లు అర్జున్ ప్రణాళికలు రచిస్తున్నాడు. ఎందుకంటే తమిళనాడు లో ఈ తరం సూపర్ స్టార్ గా పిలవబడే విజయ్ సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ కి బాగా వయసొచ్చేసింది. మహా అయితే ఇక కేవలం ఆయన రెండు మూడు సినిమాలు మాత్రమే చేస్తాడు.
వీళ్లిద్దరి తర్వాత తమిళ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ లో ఒకరైన అజిత్ కూడా ఈమధ్య కాలం లో సినిమాల మీద ఫోకస్ బాగా తగ్గించేసాడు . ఆయన ద్రుష్టి మొత్తం ఇప్పుడు రేసింగ్ మీదనే ఉంది. ఇలా తమిళనాడు కి చెందిన ఈ ముగ్గురు స్టార్ హీరోలు స్పేస్ ఇవ్వడంతో, ఆ స్పేస్ ని కబ్జా చేయడానికి చూస్తున్నాడు అల్లు అర్జున్. అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన అక్కడి స్టార్ డైరెక్టర్ అట్లీ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం ఈ ఏడాది మే లో పూర్తి అవుతుందట. ఈ సినిమా పూర్తి అవ్వగానే అల్లు అర్జున్ మరో తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది. వీళ్ళిద్దరితో చేయబోయే ఈ సినిమాలు సూపర్ హిట్ అయితే ఇక అల్లు అర్జున్ తమిళనాడు లో కూడా జెండా పాతేసినట్టే.
మన టాలీవుడ్ లో ఎన్టీఆర్ కాలం నుండి ఎంతో మంది బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ఉన్నారు. కానీ ఒక్కరు కూడా తమిళం లో తమకంటూ ఒక నిర్దిష్టమైన మార్కెట్ ని క్రియేట్ చేసుకోలేకపోయారు. అప్పట్లో అక్కినేని నాగార్జున నటించిన ‘గీతాంజలి’, ‘శివ’ చిత్రాలు తమిళంలో డబ్ అయ్యి సూపర్ హిట్స్ గా నిలిచాయి. నాగార్జున కి తమిళనాడు యూత్ లో మంచి క్రేజ్ ని కూడా తీసుకొచ్చింది. కానీ ఎందుకో ఆ తర్వాత ఆయన మార్కెట్ ని కొనసాగించలేకపోయాడు. ఇక నేటి జనరేషన్ లో రామ్ చరణ్ తమిళనాడు లో ‘మావీరన్’, ‘రగలై’ చిత్రాలతో భారీ బ్లాక్ బస్టర్స్ ని అందుకున్నాడు. రామ్ చరణ్ కి కూడా ఆ ప్రాంతం లో మంచి క్రేజ్ ఉంది. కానీ ఎందుకో ఆయన కూడా అక్కడ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ పెడుతున్నాడు, ఎంత మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి.