Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ‘పుష్ప’ సిరీస్ తర్వాత పాన్ ఇండియన్ సూపర్ స్టార్ అయిపోయాడు, ఇక నుండి ఆయన చేసే ప్రతీ సినిమా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంటుంది అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఊహించారు. ఊహించినట్టు గానే ఆయన తన తదుపరి చిత్రాన్ని అందరి అంచనాలను దాటి తమిళ టాప్ డైరెక్టర్ అట్లీ ఒక సూపర్ హీరో పాన్ వరల్డ్ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎలాంటి విరామం లేకుండా శరవేగంగా సాగుతుంది. ఈ చిత్రం వరకు ఓకే. కానీ ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎవ్వరూ ఊహించని ఒక క్రేజీ ప్రాజెక్ట్ ని మన ముందుకు తీసుకొని రాబోతున్నాడు. ఒక పాన్ ఇండియన్ స్టార్ నుండి ఇలాంటి ప్రాజెక్ట్ ని అభిమానులు ఊహించి ఉండరు. పూర్తి వివరాల్లోకి వెళ్తే అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో గతం లో ‘సరైనోడు’ అనే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నాడట అల్లు అర్జున్. చాలా కాలం క్రితమే గీతా ఆర్ట్స్ సంస్థ బోయపాటి శ్రీను కి తమ బ్యానర్ లో ఒక సినిమా చేయాల్సిందిగా అడ్వాన్స్ ఇచ్చారు. ఆ అడ్వాన్స్ ఇంకా బోయపాటి తోనే ఉంది. ముందుగా సూర్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక సినిమా చేద్దామని అనుకున్నారు. కానీ ఎందుకో అది వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు తన సొంత బ్యానర్ లోనే ‘సరైనోడు 2’ చెయ్యాలని ఫిక్స్ అయిపోయాడు అల్లు అర్జున్. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా తెలియనున్నాయి. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్ సినిమాలకు అలవాటు పడిన జనాలు, ఇలాంటి మాస్ కమర్షియల్ సినిమాలను చూడడానికి ఇష్టపడుతారా?, అల్లు అర్జున్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని ఆయన అభిమానులు కొంతమంది వాపోతున్నారు.
కానీ పుష్ప అనే చిత్రం ఒక మాస్ కమర్షియల్ సినిమా అనే విషయాన్నీ మర్చిపోయారని, ఆ సినిమాతోనే అల్లు అర్జున్ పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని రూల్ చేసాడని, అల్లు అర్జున్ కి అలాంటి అద్భుతమైన టాలెంట్ ఉంది కాబట్టి, సరైనోడు సీక్వెల్ ని కచ్చితంగా సక్సెస్ చేయగలడు అని మరికొంతమంది అభిమానులు అనుకుంటున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను ‘అఖండ 2’ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా విడుదల అయ్యాక ఆయన కొంతకాలం విరామం తీసుకొని, ‘సరైనోడు 2’ స్క్రిప్ట్ పై ఫోకస్ పెడతాడని, ఈలోపు అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ ని కూడా పూర్తి చేసేస్తాడని అంటున్నారు. చూడాలి మరి ఈ సీక్వెల్ ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనేది.