Allu Arjun And Trivikram: ‘పుష్ప 2’ సినిమాతో పాన్ ఇండియాలో స్టార్ హీరోగా అవతరించిన నటుడు అల్లు అర్జున్… ప్రస్తుతం అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియాను శాసించే హీరోల్లో తను ప్రథమ స్థానంలో ఉన్నాడు. అట్లీతో చేస్తున్న సినిమాతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంటే ఇండియాలో ఆల్మోస్ట్ అల్లు అర్జున్ నెంబర్ వన్ హీరోగా మారే అవకాశాలైతే ఉన్నాయి. ఇక తనతో ఇతర హీరోలందరూ పోటీపడుతున్నప్పటికి అతను అందరికంటే ముందు వరుసలో ఉన్నాడు. కాబట్టి అతని ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది… ఇక త్రివిక్రమ్ తో సినిమా చేస్తానని మొదట కమిటైనా అల్లు అర్జున్ త్రివిక్రమ్ ను పక్కన పెట్టి అట్లీ ని రంగంలోకి దించాడు. ఇక ప్రస్తుతం అతనితో సినిమా చేస్తున్నప్పటికి ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో సినిమా ఉంటుంది అంటూ కామెంట్లైతే చేశాడు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ వైఖరి పూర్తిగా మారిపోయింది. మరోసారి ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ ని పక్కన పెట్టి లోకేష్ కనకరాజుకి సినిమా చేసే అవకాశం ఇచ్చాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా అనౌన్స్మెంట్ అయితే వచ్చింది…
అల్లు అర్జున్ కెరీర్ డౌన్ లో ఉన్నప్పుడు మూడు సక్సెస్ లను అందించి అల్లు అర్జున్ ను టాప్ లెవెల్ కి తీసుకువచ్చిన ఘనత త్రివిక్రమ్ కే దక్కుతుంది. అలాంటి త్రివిక్రమ్ ను అల్లు అర్జున్ ఈరోజు పక్కన పెట్టడం సరైనది కాదు. అల్లు అర్జున్ వైఖరిని చూసి త్రివిక్రమ్ అభిమానులు చాలా వరకు అల్లు అర్జున్ మీద కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకంటే ఒక రకంగా అల్లు అర్జున్ ఈ రోజు టాప్ హీరోల లిస్టులో ఉన్నాడు అంటే దానికి త్రివిక్రమ్ మూల కారణం అంటూ చెబుతున్నారు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో లాంటి మూడు సక్సెస్ లను కట్టబెట్టిన ఘనత త్రివిక్రమ్ కే దక్కింది. ఇక అలాంటి త్రివిక్రమ్ ఈరోజు తన మార్కెట్ పెరిగిందని త్రివిక్రమ్ కి పాన్ ఇండియాలో అంత పెద్ద మార్కెట్ లేదని అతన్ని పక్కన పెట్టడం సరైన విషయం కాదు. తనకు ఒకసారి అవకాశం ఇస్తే తనను తాను ప్రూవ్ చేసుకుంటాడు కదా అని మరి కొంతమంది చెబుతున్నారు.
కానీ అల్లు అర్జున్ మాత్రం ఇవన్నీ పట్టించుకోవడం లేదు తను నెంబర్ వన్ హీరోగా మారాలి అంటే టాప్ లెవెల్లో ఉన్న డైరెక్టర్లతోనే సినిమాలు చేయాలని అనుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక అట్లీ, లోకేష్ కనకరాజు సినిమాలు సక్సెస్ లను సాధిస్తాయా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…