Pushpa Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా ‘పుష్ప’. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం మొదటి పార్ట్ పుష్ప ది రైజ్ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదలై ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కానీ తెలుగులో తప్ప ఇతర భాషల్లో సినిమాకు ఇంకా ప్రమోషన్స్ స్టార్త్బ్ చేయలేదు అని బన్నీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో బన్నీ వివిధ ప్రాంతాలకు వెళ్లి సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఈ మేరకు నిన్న బన్నీ చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించారు.

తనదైన శైలిలో బన్నీ ఇచ్చిన స్పీచ్ కి అక్కడి వారంతా ఫిదా అయ్యారని చెప్పాలి. పూర్తిగా తమిళంలో మాట్లాడుతూ కనిపించాడు. నిజానికి బన్నీ తన యంగేజ్ వరకు కూడా తమిళనాడులోనే పెరిగాడు. కాబట్టి అతడికి తమిళంలో మాట్లాడడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. కానీ అక్కడి మీడియా వారు మాత్రం బన్నీ తమిళ ఫ్లుయెన్సీకి ఆశ్చర్యపోయారు. ఇక బన్నీ తన మూలాలు తమిళనాడులోనే ఉన్నాయని చెబుతూ… తాను తమిళుడినని చెప్పడం విశేషం. తాను పుట్టింది మద్రాస్ లో అని ఇరవై ఏళ్ల వయసు వచ్చేవరకు ఇక్కడే ఉన్నానని చెప్పాడు.
Also Read: నాగిని పాటకు స్టెప్పులు ఇరగదీసిన నటి ప్రగతి… ఫిదా అవుతున్న కుర్రకారు
స్కూల్ లో తనతో కలిసి చదువుకున్న ఫ్రెండ్స్, చదువు చెప్పిన టీచర్స్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారని… ఇక్కడ తన సినిమా బాగా ఆడితే చూడాలనేది తన కల అని బన్నీ చెప్పుకొచ్చాడు. తన సినిమాలు హిందీలో అనువాదమై చాలా బాగా ఆడాయని నార్త్ లో ఎంత ఫాలోయింగ్ సంపాదించుకున్నప్పటికీ తాను పుట్టి పెరిగిన తమిళనాడులో తన సినిమా బాగా ఆడాలనేది తన కోరిక అని చెప్పాడు. ఏదొక సినిమా అని కాకుండా కోలీవుడ్ లో సరైన సినిమాతో ఎంట్రీ ఇవ్వాలని ఇంతకాలం ఆగానని ‘పుష్ప’ సినిమా కచ్చితంగా ఇక్కడి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని చెప్పుకొచ్చాడు బన్నీ. నాలుగు సినిమాలకు పడే కష్టం ఈ ఒక్క సినిమాకి పడ్డామని… తిరుపతిలో ఎర్రచంద్రనం చుట్టూ తిరిగే కథ కావడంతో కోలీవుడ్ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారని చెప్పాడు.
Also Read: టికెట్ రేటు విషయంలో హైకోర్టు తీర్పుపై… డివిజనల్ బెంచ్ లో పిటిసన్ వేసిన ఏపీ సర్కారు