Allu Arjun High Court Relief: ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ వృద్ధిలోకి వచ్చిన తర్వాత ఈమధ్య కాలం లో ఏది నిజం , ఏది అబద్దం అనేది తెలుసుకోవడం చాలా కష్టం గా మారింది. ముఖ్యంగా సోషల్ మీడియా లో అయితే సినీ సెలబ్రిటీల ఫోటోలకు భద్రత లేకుండా పోయింది. వాళ్ళ ఫోటోలను మార్ఫ్ చేసి ఇష్టమొచ్చినట్టు వాడేస్తున్నారు. కొందరు అయితే సదరు సెలబ్రిటీలను ట్రోల్ చేయడానికి ఇలాంటి మార్ఫింగ్స్ కి పాల్పడుతుంటే , మరికొందరు మాత్రం వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుతున్నారు. రీసెంట్ గా ఇలాంటి ఘటనలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) విషయం లో జరిగాయి. అందుకే ఆయన తన వ్యక్తిగత ఫోటోలకు , పేర్లకు, వీడియోలు భద్రతా కలిపించాలంటూ ఢిల్లీ హై కోర్టు మెట్లు ఎక్కాడు. అయితే హై కోర్టు అల్లు అర్జున్ పిటీషన్ ని నేడు విచారించి ఆయనకు పాజిటివ్ గా ఉత్తర్వులు జారీ చేసింది.
ఇకపై అల్లు అర్జున్ పేరు ని కానీ , ఫోటోలను కానీ ఆయన అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఎవ్వరూ కూడా ఉపయోగించుకోరాదని , అలా చేస్తే శిక్షార్హులు అంటూ చెప్పుకొచ్చింది హై కోర్టు. అంటే ఇక మీదట ఎవ్వరైనా ట్రోలింగ్ కోసం కానీ , వేరే ఏ దురుద్దేశంతో అయినా అల్లు అర్జున్ పేరు ని, ఆయన ఫోటోలను సోషల్ మీడియా లో ఉపయోగించుకుంటే, జైలులో కూర్చొని ఊచలు లెక్కపెట్టక తప్పదు. కాబట్టి సోషల్ మీడియా లో ట్రోలర్స్ , మీమర్స్ ఇక మీదట జాగ్రత్త గా ఉండాలి. టాలీవుడ్ లో మోస్ట్ యాక్టీవ్ పీఆర్ టీం అల్లు అర్జున్ కి మాత్రమే ఉంది. కాబట్టి అల్లు అర్జున్ పేరు ని ఉపయోగించే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకోండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లోనే హాట్ టాపిక్ గా మారింది.
ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం ముంబై లో ‘రాకా’ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. రెగ్యులర్ గా హైదరాబాద్ నుండి ముంబై కి వెళ్తూ రావడం కంటే , ముంబై లో ఉండడమే బెస్ట్ అని నిర్ణయించుకున్న అల్లు అర్జున్ , రీసెంట్ గానే అక్కడ ఒక్క ఇంటిని కొనుగోలు చేసి తన భార్యాపిల్లలతో ఆ ఇంట్లోకి రీసెంట్ గానే ప్రవేశించాడు. అంటే ఇకపై ఆయన ముంబై లోనే ఎక్కువ శాతం ఉండబోతున్నాడు అన్నమాట. హైదరాబాద్ కి కేవలం షూటింగ్స్ సమయం lo మాత్రమే వస్తాడని అంటున్నారు. ఈ ఏడాది లోనే ‘రాకా’ మూవీ షూటింగ్ పూర్తి కాబోతుంది. అనంతరం ఆయన లోకేష్ కనకరాజ్ దర్శకత్వం లో ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.