https://oktelugu.com/

Gouri Munjal : అప్పటికీ ఇప్పటికీ తగ్గని సోయగం.. బన్నీ పాప లేటెస్ట్ పిక్స్ చూశారా?

కానీ ఇటీవల ఆమె లెటేస్ట్ పిక్స్ ను షేర్ చేసింది. అసలు విషయమేంటంటే అప్పటికీ ఇప్పటికీ గౌరీ ముంజల్ అందం ఏమాత్రం తగ్గేలేదు. ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా నటించడానికైనా రెడీ అన్నట్లు కనిపిస్తోంది.

Written By:
  • NARESH
  • , Updated On : March 9, 2024 / 11:38 AM IST

    Gouri Munjal (1)

    Follow us on

    Gouri Munjal : సినీ ఇండస్ట్రీలో ఉన్నంతకాలం హీరోయిన్ల హవా సాగుతోంది. సినిమాల్లో నుంచి బయటకు వచ్చాక వారి గురించి ఎవరూ పట్టించుకోరు. అయితే సోషల్ మీడియా పుణ్యమాని చాలా మంది సినిమాల్లో కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం కనిపిస్తున్నారు. కొన్ని సంవత్సరాల కిందట ఓ హీరోయిన్ వరుస సినిమాలతో దూసుకుపోయింది. కానీ ఆ తరువాత ఒక్కసారిగా కనుమరుగైపోయింది. అయితే ఇటీవల ఆమె సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. ఎందుకంటే సినిమాల్లో కొనసాగినంత కాలం ఆమె ఎలా ఉండేదో.. ఇప్పుడు కూడా అంతే అందంతో ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా?

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో ఎన్నో బెస్ట్ సినిమాలు ఉన్నాయి. కానీ మాస్ ఎంటర్టైన్మంట్ సినిమా అంటే బన్నీ మాత్రమే. వివి వినాయక్ డైరెక్షన్ల వచ్చిన ఈ మూవీ మొత్తం యాక్షన్ సీన్స్ ఉండడంతో ఇందులో బన్నీ కొత్తగా కనిపిస్తారు. ఇందులో ఐకాన్ స్టార్ పక్కన అందాలు ఆరబోసింది గౌరీ ముంజల్. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ భామ ఈ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీతోనే బెస్ట్ యాక్టర్ అని అనిపించుకుంది. ఆ తరువాత పలు సినిమాల్లో నటించింది.

    గౌరీముంజల్ కెరీర్ లో బెస్ట్ ఫిలింస్ ఎన్నో ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణ 2006, గోపి, కౌసల్యా సుప్రజా రామ, బంగారు బాబు సినిమాలు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. తెలుగులోనే కాకుండా కన్నడ, మలయాళ ఇండస్ట్రీలో పలు సినిమాలు చేసిన ఈమె 2011 నుంచి సినిమాలకు దూరంగా ఉంటోంది. అయితే చాలా మంది హీరోయిన్లు సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తమ అప్డేట్స్ ను ఇస్తున్నారు. కానీ గౌరీ ముంజల్ మాత్రం దీనికి దూరంగా కొనసాగారు.

    కానీ ఇటీవల ఆమె లెటేస్ట్ పిక్స్ ను షేర్ చేసింది. అసలు విషయమేంటంటే అప్పటికీ ఇప్పటికీ గౌరీ ముంజల్ అందం ఏమాత్రం తగ్గేలేదు. ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా నటించడానికైనా రెడీ అన్నట్లు కనిపిస్తోంది. సినిమాల నుంచి దూరమై చాలా కాలం తరువాత కొందరు హీరోయిన్లు గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. కానీ ఈ భామ మాత్రం అలాగే ఉండడంపై అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇంతకీ మీ అందం రహస్యమేంటి? అని చాలా మంది ఆమె షేర్ చేసిన పిక్స్ కింద కామెంట్స్ పెడుతున్నారు. అయితే గౌరీ ముంజల్ సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేస్తారా? లేదా? అనేది మాత్రం చెప్పలేదు.