ఈ మూవీలో రాంచరణ్ కీలక పాత్రలో దాదాపు 30నిమిషాలు కనిపించేలా దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేశాడు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో రాంచరణ్ బీజీగా ఉండటంతో ఈ మూవీ కూడా ఆలస్యం అవకాశం ఏర్పడింది. ఈ మూవీని త్వరగా తీసుకొచ్చేందుకు రాంచరణ్ ఈ మూవీని తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఆఫర్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ వద్దకు వెళ్లింది. రాంచరణ్ చేయాల్సిన పాత్రలో అల్లు అర్జున్ అయితే బాగుంటుందని కొరటాల శివ భావిస్తున్నారట. ఈ మూవీలో నటించేందుకు అల్లు అర్జున్ ఎంతో ఉత్సాహాన్ని చూపుతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవికి జోడీగా త్రిష రెండోసారి నటిస్తుంది. మణిశర్మ ఈ మూవీకి అదిరిపోయే బాణీలను సమకూరుస్తున్నాడు.
ఇటీవల అల్లు అర్జున్ నటించిన ‘అల..వైకుంఠపురములో’ మూవీ సంక్రాంతి కానుకగా వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ అల్లు అర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. తెలుగుతోపాటు మళయాళం, యూకేలోనూ ‘అల.. వైకుంఠపురములో’ భారీ కలెక్షన్లు రాబట్టింది. ఓ వైపు ఈ సక్సస్ ఎంజాయ్ చేస్తుండగానో మరోవైపు చిరంజీవిలో మూవీలో స్పెషల్ రోల్ ఆఫర్ దక్కింది. ఈ వార్తే నిజమైతే మాత్రం తెరపై చిరంజీవితో కలిసి అల్లు అర్జున్ రఫ్పాడించడం ఖాయంగా కన్పిస్తోంది. ఈ మూవీని రాంచరణ్ కొణిదల ప్రొడక్షన్ బ్యానర్లో నిర్మిస్తున్నాడు. చిరు-152 మూవీకి ‘ఆచార్య’ అనే టైటిల్ ఖారారైనట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా టాలీవుడ్లో క్రేజీ కాంబినేషన్లో తెరపై వస్తుండటంతో అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.